తమన్నాతేడాగా అలాంటివే కోరుకుంటుందా?
తమన్నా తనకు ప్రత్యేకత కోరుకుంటోందో ఏమో గానీ ప్రతీదీ రివర్స్ లో మాట్లాడుతోంది. తమిళ హీరో కార్తీకి మీకు మధ్య ఏదో ఉందంటూ వార్తలు వస్తున్నాయి కదా అని రెగ్యులర్ క్వచ్చినే ఆమెని మీడియావారు అడగ్గానే ఆమె...అటువంటి రూమర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రత్యేకంగా పనికట్టుకుని మరీ ఈ రూమర్స్ ఎక్కడున్నాయో వెతుక్కుని చదువుతాను తెలుసా...అని సమాధానమిచ్చి షాక్ ఇచ్చింది. అలాగే ఆ రూమర్స్ వస్తేనే కదా నేను సెలబ్రెటీగా ఉన్నట్లు లెక్క. అలాగే అవి చదువుతున్నప్పుడు నాకు పూర్తి నవ్వు వస్తుంది. ఇక ఈ రూమర్స్ కి నేను మీడియాకి సమాధానం చెప్పక్కర్లేదేమో అంది. మీడియా వారు ఏంటిలా రివర్స్ లో మాట్లాడుతోంది అనుకుంటుంటే..రూమర్స్ క్రియేట్ చేసేది మీడియా వాళ్ళే ..దానికి నేను రెస్పాన్స్ ఇవ్వక్కర్లేదు. అలాగే నేను కేవలం మా తల్లితండ్రులు ఈ విషయం మీద నిలదీస్తే అప్పుడు నోరు విప్పి నిజం చెప్పాలి అంది. అయినా నాకు ఆ అవకాశం రాదు. మా అమ్మా నాన్న నన్ను అర్ధం చేసుకుంటారు అంది. ప్రస్తుతం తమన్నా...నాగ చైతన్య సరసన సుకుమార్ దర్శకత్వంలోనూ, అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ వినాయిక్ దర్శకత్వంలో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











