Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
స్టార్ హీరోకు తమన్నా ట్విస్టు
హ్యాపీడేస్ గర్ల్ తమన్నా తాజాగా మరో స్టార్ హీరో విశాల్ ఆఫర్ ని తోసిపుచ్చింది. డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్పుకున్నా నిజానికి రోజు రోజుకీ పెర్గుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకునే తమన్నా అలా సమాధాన మిచ్చినట్లు సమచారం. ఎందుకంటే విశాల్ ఆఫర్ చేసిన ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్. దాంతో ఆమె తాను నలుగురులో ఒకరిగా చేసే స్ధాయికి ఇంకా దిగజారలేదన..తనే సోలో హీరోయిన్ అయితే చేస్తానని ఇండైరక్ట్ గా చెప్పించిందని సమాచారం.
అప్పటికీ తమన్నా పాత్రకు ప్రయారిటీ ఇస్తానని, ఆ సినిమా('తీర్ధ విలయాట్టు పిళ్లై')స్క్రిప్టుతో సహా ఆమె దగ్గరికి పంపాడంటున్నారు. ఎవరెన్ని చెప్పినా అటువంటి పాత్రలు చేయలేనని, అయినా తన డేట్స్ కావాలంటే ఏడాది పైగా ఆగాలి అని చెప్పిందిట. ఇప్పటికే విశాల్ తక్కిన ఇద్దరూ హీరోయిన్లుగా రీమాసేన్, తనూశ్రీలను ఎంపిక చేశారు. ఇప్పుడు తమన్నా బదులు మరో హీరోయిన్ కోసం ఎంపిక జరుగుతోంది. తమన్నా ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబుతో 'వరుడు' చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా నిరాకరించింది. సెకెండ్ హీరోయిన్ రోల్ ఆమెకు ఆఫర్ చేయడమే ఇందుకు కారణం అని వినపడింది.
తమిళంలో తమన్నా నటించిన 'కల్లూరి' కమర్షియల్ సక్సెస్ తో పాటు ఆమెకు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. సూర్యకు జోడిగా ఆమె నటించిన 'అయన్' కూడా ఈనెలలోనే విడుదలై హిట్ గా డిక్లేర్ అయింది. వారం తేడాతో 'ఆనందతాండవం' చిత్రం సైతం తమిళ, తెలుగులో విడుదలై తమన్నాకు ఉన్న డిమాండ్ ను తెలియజెప్పింది.సూర్య వంటి స్టార్ హీరోలతో నటిస్తున్న తరుణంలో మల్టీ హీరోయిన్ల చిత్రాల్లో నటించడం వల్ల తన కెరీర్ కు పెద్దగా ప్రయోజనం ఉండదనే ఆలోచనతోనే విశాల్ సరసన నటించేందుకు తమన్నా నిరాకరించినట్టు నిశ్లేషకులు చెబుతున్నారు.