హాట్ బ్యూటీ తమన్నా రేటు పెరిగింది!
చెన్నై: తన అంద చందాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్ తమన్నా. సెక్సీ నడుపు, శృంగార ప్రియులను మత్తెచ్చించే ఆమె సొగసైన హొయలు, అద్భుతమైన నటన, హావభావాలు వెరసి.... సౌత్‌లో ఆమెను టాప్ హీరోయిన్ గా ఎదిగేలా చేసాయి. నిన్న మొన్నటి వరకు రూ. కోటి దాటని తమన్నా రెమ్యూనరేషన్.... ఇప్పుడు ఏకంగా కోటిన్నర రూపాయలకు(రూ.1.5కోట్లు) పెరిగింది.
తమిళంలో అజిత్‌తో చేయబోయే సినిమాకు తమన్నా కోటిన్నర డిమాండ్ చేసిందని, ఆ మేరకు ఇచ్చేందుకు చిత్ర నిర్మాతలు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ(శౌర్యం, దరువు ఫేం) దర్శకత్వం వహించనున్నాడు. ఈ డీల్ తో తమన్నా సౌత్ లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్‌గా వార్తల్లోకెక్కింది.
తమన్నా ప్రస్తుతం 'హిమ్మత్ వాలా' అనే బాలీవుడ్ చిత్రంతో పాటు... తమిళంలో అజిత్ తో ఓ సినిమా, తెలుగులో భలే తమ్ముడు అనే చిత్రంలో చేస్తోంది. ఇటీవల తమన్నా నటించిన సినిమాలేవీ పెద్దగా విజయం సాధించ లేదు. అయినప్పటికీ తమన్నా రెమ్యూనరేషన్ ఈ రేంజికి చేరడం గమనార్హం.
ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించక పోయినప్పటికీ... తమన్నా గ్లామర్, నటన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది, అందుకే ఆమెకు ఇంతలా డిమాండ్ పెరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి తమన్నా తన హవా ఎంత కాలం కొనసాగిస్తుంది, తనకున్న డిమాండ్ ఎంత కాలం నిలబెట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











