తమన్నా ఇంకా ప్రేమలో పడలేదట, పడితే అంతేనట
తానింకా ప్రేమలో పడలేదని తమన్నా అంటోంది. ఇప్పుడు తమన్నా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. దాంతో ఆమె ఎక్కడున్నా మీడియా ప్రతినిధులు చుట్టుముట్టేస్తున్నారు. అలా చుట్టుముట్టినప్పుడు ఓ చెన్నై మీడియా ప్రతినిధి మీరెవరినైనా ప్రేమించారా అని అడిగాడట. లేదని తమన్నా నుంచి టకీమని సమాధానం వచ్చింది. ప్రేమలో పడితే మాత్రం వెంటనే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మడు చెప్పేసింది. తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా, తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అని మీడియా ప్రతినిధులు అడిగారు. తమిళ వ్యక్తి, తెలుగు వ్యక్తి అని తేడాలేమీ ఉండవని, తనకు నచ్చితే చాలునని ఆమె అన్నది. ప్రేమలో పడితే మాత్రం ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తమన్నా కచ్చితంగా తేల్చేసింది.


Click it and Unblock the Notifications











