చెన్నైలో పార్ట్ టైమ్ తమన్నా వ్యాపారం
హ్యాపీ గర్ల్ తమన్నా చెన్నైలో త్వరలో రియల్ ఎస్టేట్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాల్లో ఆమె బిజీబిజీగా మునిగితేలుతోంది. దాదాపు సినిమాకు డబ్బై ఐదు లక్షలు వరకూ తీసుకుంటున్న ఆమె ఆ సొమ్ముని సరైన విధంగా ఇన్వెస్ట్ చేసి లాభాలు సంపాదించాలనే ఈ ప్లాన్ చేసిందని ఆమె శ్రేయాభిలాషులు చెప్తున్నారు. ఈ మేరకు ఆమె చెన్నై లోని కొన్ని ప్రాంతాల్లో స్ధలాలు కొంటోందని, అలాగే ఓ కనస్ట్రక్షన్ కంపెనీ వారితో మాట్లాడి అపార్టమెంట్ నిర్మాణంలో ఆమె సొమ్మను పెట్టుబడిగా పెట్టాలని భావిస్తోంది. ఇక ప్రస్తుతం తమన్నా నటించిన పయ్యా తమిళ చిత్రం యావరేజ్ అయింది. ఆ చిత్రం తెలుగులో ఆవారా గా రిలీజు అవబోతోంది. కార్తీ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. అలాగే తమన్నా డైరక్టుగా తెలుగులో అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ, నాగచైతన్య సరసన సుకుమార్ దర్శకత్వంలోనూ నటిస్తోంది. ఇక తమన్నా బిజెనెస్ ను పార్ట్ టైమ్ గానూ సినిమానుఫుల్ టైమ్ జాబ్ గానూ అభివర్ణిస్తోంది.


Click it and Unblock the Notifications