ఒంటరితనం భరించలేకే అలా చేస్తున్నా...తమన్నా
"నాకు ఇంటిమీద బెంగ ఎక్కువ. వారం రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళకపోతే అసలేమీ తోచదు.అయితే షూటింగ్‌ల నిమిత్తం ఎక్కువగా దక్షిణాదినే ఉంటున్నా. కానీ నన్ను ఒంటిరితనం భాధిస్తోంది. అందుకే ఇక్కడ ఇల్లు కూడా సొంతంగా తీసుకోలేదు. అమ్మ, నాన్నలను వదిలిపెట్టి ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఎంత బిజీగా ఉన్నా ముంబై వెళ్ళి నా ఫ్రెండ్స్‌ని, ఇంటిని ఓ సారి చూసిరానిదే మనసు కుదుటపడట్లేదు అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. అలాగే తనకీ, తమిళ హీరోకి కార్తీకి రిలేషన్ ఉన్నట్లు రాస్తున్నారని,అది తెర వరకే నని గుర్తు పెట్టుకోవాలని అంది.అలాగే నాకున్న మంచి ఫ్రెండ్స్ కేవలం..పూనమ్ బజ్వా, వేదిక. వీరిద్దరిని కలిస్తే చాలు...అల్లరల్లరి చేసేస్తాను. నా గురించి తెలిసిన మంచి ఫ్రెండ్స్ వీరిద్దరు అంది. కావాలని పనిగట్టుకుని మరీ కార్తీకి తనకూ ఏ విధమైన రిలేషన్ లేదని ఎస్టాబ్లిష్ చేయటానికే ఆమెఈ కబర్లు చెప్తోందంటున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో అల్లు అర్జున్ తో బద్రీనాథ్ చిత్రంలో మరియు సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications











