తమన్నాపై కన్నెర చేసిన నిర్మాతలు....!
100% లవ్ తో రాబోతున్న తమన్నా అటు ఇటు టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకొన్నది. టాలీవుడ్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకొన్న తర్వాత కోలీవుడ్ లో విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. అలాగే టాలీవుడ్ లో తన స్టారిజం కోసం తహతహాలాడుతోంది. అందుకే రీసెంట్ గా జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకి కమిట్ మెంట్స్ ఇచ్చేసిందని, పెంచి పెద్ద చేసిన తర్వాత పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోతే తల్లిదండ్రులు ఎంతగా ఫీలవుతారో తమిళ నిర్మాతలు కూడా ఇప్పుడు తమన్నా పట్ల అలాగే ఫీలవుతున్నారట. ఎందుకంటే, మొదట్లో తెలుగు సినిమా రంగం కాదు పొమ్మంటే, తమన్నాను తామే ఆదరించి సినేమాలిచ్చి స్టార్ ని చేశామనీ, మిగతా హీరోయిన్లను కాదని చెప్పి ఈమెను నెంబర్ వన్ పీఠంపై కూర్చోబెట్టామనీ, అలాంటిది ఇప్పుడు తను తమిళ సినిమాలను రిజెక్ట్ చేయడం బాధగా ఉందనీ కోలీవుడ్ నిర్మాతలు ఫీలవుతున్నారట.
అంతేకాదు, ఆమె మీద చాలా గుర్రుగా కూడా వున్నారంటున్నారు. తెలుగులో పారితోషికం ఎక్కువ ఇవ్వడంతో ఇప్పుడు కోలీవుడ్ ని తమన్నా నిర్లక్ష్యం చేస్తోందని అక్కడి నిర్మాతలు ఆరోపిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, తమన్నా మాత్రం వీటిని ఖండిస్తోంది. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారెవరో ఈ పుకార్లు పుట్టిస్తున్నారనీ, కోలీవుడ్ లో అలాంటి ఫీలింగేమీ లేదనీ అంటోంది. అయినా, తెలుగు, తమిళ భాషలు తనకు రెండు కళ్ళు లాంటివని రాజకీయవేత్తల్లా చెబుతోంది.!


Click it and Unblock the Notifications











