కన్పూజ్ అయ్యే తప్ప కావాలని కాదు...క్షమించండి: తమన్నా
తెలుగులో సినిమాలు చేస్తాను అనగానే చాలా మంది రకరకాల ఆఫర్స్ తో ముందుకొచ్చారు. ఊహకు అందని అవకాశాలు నా దగ్గరకు వచ్చాయి. ఆ క్రమంలో ఎలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలో తెలీక ముందు కన్ఫూజ్ అయ్యాను. ఏ చిత్రం ఓకే చేయాలో అర్దం కాలేదు. కొన్ని కథలు బాగుంటే..మరికొన్నిటిలో నా పాత్ర బాగుండేది. ఇవేమి లేకుండా దర్శకుడు,నిర్మాత బాగున్న క్రేజీ ప్రాజెక్టు కొన్ని ఉన్నాయి. ఏది ఒప్పుకోవాలి..ఏది నా కెరీర్ నిలబెడుతుంది అన్నది నాకు పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో ఎన్నో కథల్ని తిరస్కరించా. నా కారణంగా ఎవరైనా హర్ట్ అయితే సారీ. ప్రస్తుతం నేను చేస్తున్న మూడు తెలుగు సినిమాలూ దేనికదే విభిన్నమైనదే. అల్లు అర్జున్‌తో చేస్తున్న బద్రీనాథ్ చాలా కొత్తగా, రిచ్ గా ఉంటుంది. ఇక నాగచైతన్యతో చేస్తున్న సినిమాలో ఓ కొత్త తమన్నాని చూస్తారు. ఎన్టీఆర్ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు అని చెప్పి ముగించింది తమన్నా.


Click it and Unblock the Notifications











