ఆ హీరోనే నాతో క్లోజ్ గా ఉంటాడు..తమన్నా
హ్యాపీ గర్ల్ తమన్నా తను పని చేసిన హీరోలలో తనతో బాగా చనువుగా ఉండే వారు గురించి చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాట్లాడింది మొత్తం తమిళ హీరోల గురించే వారిలో .. సూర్య చాలా సింపుల్. ధనుష్ తెగ అల్లరి చేస్తాడు. విజయ్ చాలా సాఫ్ట్. భరత్, 'జయం' రవి ఫ్రెండ్లీగా చాలా క్లోజ్‌గా ఉంటారు' అని చెప్పింది. అయితే వీరు కాకుండా ఆమెకు పర్శనల్ గా రజనీకాంత్ అంటే ఇష్టం అంటోంది. ఆయన సరసన ఒక్క సినిమాలో నన్నా చేయాలంటోంది. కనీసం ఒక్క సినిమాలో అయినా ఆయనతో నటిస్తే చాలు. ఆ అవకాశం వస్తే అంతకన్నా ఆనందం మరోటి ఉండదు. ఓ గమ్మత్తయిన విషయం చెప్పనా? మా అమ్మ పేరు కూడా రజనీనే. అదేంటి అనుకుంటున్నారా..? ఈ పేరుని ఆడ, మగ ఎవరైనా పెట్టుకోవచ్చు కదా?' అన్నారు తమన్నా. తమన్నాకు ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు.చేస్తున్న మూడు చిత్రాలు తమిళంవే కావటం విశేషం. అవి..'జయం' రవి సరసన 'కిక్' రీమేక్ 'తిల్లాలంగడి', కార్తీక్ తో 'పయ్యా', విజయ్ సరసన 'సురా' చిత్రాలు.


Click it and Unblock the Notifications











