భూమిని, బంగారాన్ని నమ్ముకున్న వాడెవ్వడూ చెడ్డట్టు చరిత్రలో లేదు!
తమిళంలో లింగస్వామి డైరక్షన్ లో కార్తీక్ సరసన తమన్నానటించిన 'పయ్యా" సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా తమన్నాాకి అక్కడున్న ఇమేజ్ ని రెండింతలు చేసింది. తన ఒకటో నెంబర్ హీరోయిన్ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. 'పయ్యా" హిట్ అయ్యేసరికి తమన్నా పారితోషికం ఏకంగా 'కోటి" దాటింది. ఓ పక్క అవకాశాల వెల్లువ, మరో పక్క డబ్బుల గలగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది పాలరాతి బొమ్మలాంటి ఈ అందాల భామ.
డబ్బు కొందరికి గర్వాన్ని పెంచితే మరికొందరికి బాధ్యతను గుర్తుచేస్తుంది. తమన్నాా ఈ రెండో కోవకు చెందిన అమ్మాయి. చిన్న వయసులో తనకు ప్రాప్తించిన ఈ లక్ష్మీ కటాక్షానికి అర్థం చేకూర్చేలా ఆర్థికపరమైన విషయాల్లో ఆచి తూచి అడుతులేస్తోంది తమన్నా. ఈ మద్యనే రియల్ ఎస్టెట్ రంగంలో అడుగిడిన తమన్నాా, చెన్నైలోని విలాసవంతమైన ప్రదేశాల్లో ప్లాట్స్ ను, భూములను కొనుగోలుచేసింది. ఎంతైనా భూమిని, బంగారాన్ని నమ్ముకున్న వాడెవ్వడూ చెడ్డట్టు చరిత్రలో లేదు కదా. గతంలో ఇలాగే డబ్బుని సద్వినియోగ పరచుకున్న త్రిష బాటలోనే ఇప్పుడు తమన్నాా వెళుతోందని తమిళ మీడియా కోడైకూస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న నేపధ్యంలో, తన పారితోషికానికి కూడా రెక్కలు తొడిగే ఆలోచనలో తమన్నాా ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











