ఆ దర్శకుడితో చేయాలని కోరిక ఉంది...తమన్నా

By Srikanya

దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రంలో నటించాలని ఉంది. ఆయన హీరోయిన్లను అందంగా చూపించడమే కాదు అభినయానికి అవకాశం ఉంటుంది. అలాగే శంకర్, శశికుమార్ ఇలా చా లా మంది దర్శకులతో పనిచేయాలని కోరుకుంటున్నాను అంటోంది హ్యాపీ గర్ల్ తమన్నా. అలాగే తనకు ఏమి మాయ చేసావే చిత్రం బాగా నచ్చిందని, గౌతమ్ మీనన్ చిత్రాలు వదిలిపెట్టకుండా చూస్తానని చెప్పుకొచ్చింది. ఇక తనకూ, తమిళ హీరో కార్తీకి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వస్తున్న వార్తలు గురించి మాట్లాడుతూ..రూమర్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి అవాస్తవాలే కనుక. అలాగే ఈ విషయంలో ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేనేమిటో నా తల్లిదండ్రులకు తెలుసు అంది. ప్రస్తతుం ఆమె ధనుష్‌ సరసన తమిళంలో వేంగై చిత్రంలో నటిస్తోంది. తెలుగులో జూనియ ర్ ఎన్జీఆర్ సరసన సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చేయటానికి సైన్ చేసింది. అలాగే ..సుకుమార్, నాగచైతన్యతో కాంబినేషన్ లోనూ, అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ చేస్తోంది. అలాగే ఆమె భరత్ సరసన నటించిన ఓ చిత్రం ప్రియ...ప్రియతమ టైటిల్ తెలుగులో డబ్బింగ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X