మహేష్ బాబు సరసన తమన్నా చేసే చిత్రం...
మహేష్ బాబు సరసన సినిమా చేయటానికి హీరోయిన్స్ ఉవ్విళ్ళూరుతుంటూరు. అయితే తాజాగా ఆ అవకాశం తమన్నాని వరించిందని సమాచారం. ప్రమఖ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో మహేష్ చేయబోయే చిత్రంకు ఆమెనే ఎంచుకున్నాడని, అందుకు మహేష్ కూడా సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లింగుస్వామి ప్రస్తుతం మహేష్ తో చేయబోయే కథతో శింబు హీరోగా తమిళంలో చిత్రం చేస్తూ తమన్నాను తీసుకున్నారు. లా స్టూడెంట్ గా తమన్నా పాత్ర కీలకమైన రోల్ కథలో ప్లే చేస్తుంది. అలాగే తమన్నా అన్నయ్య పాత్రకు మాధవన్ ని అడిగారని అతను ఇంకా డెషిషన్ తీసుకోలేదని చెప్తున్నారు. అతన్ని తెలుగు, తమిళ వెర్షన్స్ రెండింటికీ అడిగారని సమాచారం. ఇక లింగు స్వామి దర్శకత్వంలో ఇంతకుముందు తమన్నా ఆవారా చిత్రంలో చేసింది. కార్తి హీరోగా చేసిన ఆ చిత్రం యావరేజ్ గా ఆడింది. అలాగే తమన్నా ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌తో ఓ చిత్రం, నాగచైతన్యతో మరో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని నిర్మించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. తమిళ వెర్షన్ మాత్రం జూలైనుంచే షూటింగ్ చేస్తారు.


Click it and Unblock the Notifications











