ఆయన ఎనర్జీ లెవెల్స్ సూపర్.. హర్డ్ వర్కర్.. నేనేమీ చెప్పినా తక్కువే.. తమన్నా
బాహుబలి తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరస చిత్రాలతో బిజీగా మారింది. ప్రస్తుతం తమిళంలో సూపర్‌స్టార్, విలక్షణ నటుడు విక్రమ్‌తో స్కెచ్, హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నది. ఈ చి
Recommended Video

బాహుబలి తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరస చిత్రాలతో బిజీగా మారింది. ప్రస్తుతం తమిళంలో సూపర్‌స్టార్, విలక్షణ నటుడు విక్రమ్‌తో స్కెచ్, హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నది. ఈ చిత్రాలకు సంబంధించిన విషయాలను, తన వ్యక్తిగత విషయాలను తమన్నా ఇటీవల మీడియాకు వెల్లడించింది.

విక్రమ్‌తో నటించడం
తమిళంలో విక్రమ్ సరసన స్కెచ్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రంలో నటించడం ద్వారా గొప్ప అనుభూతికి లోనయ్యాను. విక్రమ్ అద్భుతమైన నటుడు. ఇతర నటీనటులకు ఇన్సిపిరేషన్‌గా ఉంటాడు. అతనితో పనిచేయడం మరచిపోలేని మెమోరీ అని విక్రమ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.

విక్రమ్ ప్రతీసారి ఏదో..
విక్రమ్ ప్రతీసారి ఏదో విశేషమైన కథను ఎంచుకొంటాడు. అందుకు నూటికి నూరుపాళ్లు తనవంతు సహాకారం అందిస్తాడు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కరెక్ట్ సమయానికి షూటింగ్‌కు వస్తాడు. చాలా హార్డ్ వర్కర్. క్రమశిక్షణ, నటనపట్ల అంకితభావాన్ని ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే. అతడి ఎనర్జీ లెవల్స్ అమోఘం. అందుకే సినీ పరిశ్రమలో విక్రమ్‌కు విశేషమైన గుర్తింపు ఉంది అని తమన్నా చెప్పింది.

క్వీన్ తెలుగు రీమేక్‌లో
హిందీలో ఘనవిజయం సాధించిన క్వీన్ చిత్రం తెలుగులో రీమేక్ చేస్తున్నాను. హిందీలో కంగన రనౌత్ పోషించిన పాత్రలో నేను నటిస్తున్నాను. కంగన స్థాయిలో నటనను ప్రదర్శించేందుకు కష్టపడుతున్నాను అని తమన్నా చెప్పింది. ఈ సినిమాలో నటించడం ద్వారా నాపై మరీ బాధ్యత పెరిగింది. ఆ పాత్రకు మరింత న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని పేర్కొన్నది.

క్వీన్ నాకో సవాల్
హిందీలో క్వీన్ చిత్రాన్ని చాలా సార్లు చూశాను. కంగన పాత్ర చాలా పవర్‌పుల్‌గా డిజైన్ చేశారు. క్వీన్ పాత్ర నాకు సవాల్ లాంటింది. ప్రేక్షకుల అంచనాలను నేను చేరుకొంటాను అని తమన్నా చెప్పింది.


Click it and Unblock the Notifications











