జయలలిత తరహాలో తమన్నా.. ఐటెం సాంగ్ కోసం కండిషన్, కుదరదని చెప్ప!

తమన్నా పేరు చెప్పగానే మిల్కిబ్యూటీ అందాలు కుర్రకారు కళ్ళముందు మెదులుతాయి. కేవలం అందం మాత్రమే కాదు.. అభిమానం, డాన్స్ లో తమన్నా సౌత్ లో తిరుగులేని ముద్ర వేసింది. తమన్నా చాలా చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో రెచ్చిపోయి నటించింది. పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఇటీవల తమన్నా లేడి ఓరియంటెడ్ చిత్రాల పట్ల కూడా ఆసక్తి చూపుతోంది. తమన్నా ప్రధాన పాత్రలో క్వీన్ చిత్ర తెలుగు రీమేక్ వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మిలో నటిస్తోంది. తమిళంలో నటించిన కన్నె కలైమనే చిత్రం ఫ్రిబ్రవరి 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శీను రామస్వామి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

జయలలిత స్ఫూర్తితో

జయలలిత స్ఫూర్తితో

కన్నె కలైమనే చిత్రంలో తమన్నా, ఉదయనిధి స్టాలిన్ జంటగా నటించారు. కానీ తమన్నా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో తమన్నా పాత్రని దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్పూర్తితో రూపొందించానని దర్శకుడు తెలిపాడు. జయలలిత చీర కట్టు, బొట్టు, ఆమె నడక ఇలా పలు అంశాలలో జయలలిత ఆధారంగా తమన్నా పాత్రని డిజైన్ చేశాం. ఈ చిత్రంలో తమన్నాని చూస్తే తప్పకుండా జయలలిత గుర్తుకు వస్తారు అని దర్శకుడు శీను రామస్వామి అన్నారు.

విజయ్ సేతుపతితో

విజయ్ సేతుపతితో

కన్నె కలైమనే కంటే ముందుగా మమానితన్ చిత్రాన్ని ప్రారంభించాలని అనుకున్నా. ఆ సమయంలో విజయ్ సేతుపతి బిజీగా ఉన్నారు. దీనితో కన్నె కలైమనే స్క్రిప్ట్ ని బయటకు తీశానని దర్శకుడు తెలిపాడు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడ్ జెయింట్ బ్యానర్ లో షణ్ముగమూర్తి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అలా కన్నె కలైమనే చిత్రం పట్టాలెక్కింది అని దర్శకుడు తెలిపారు.

ఐటెం సాంగ్ కుదరదు

ఐటెం సాంగ్ కుదరదు

ఈ చిత్రంలో ఐటెం సాంగ్ తప్పనిసరిగా ఉండాలని షణ్ముగమూర్తి కండిషన్ పెట్టారు. ఇది హీరోయిన్ పాత్ర ప్రధానంగా సాగే చిత్రం. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కుదరదని చెప్పేశా. ఈ విషయాన్ని హీరో ఉదయనిధి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లా. మీరు షూటింగ్ కి ప్లాన్ చేసుకోండి. నిర్మాతతో నేను మాట్లాడతా అని సమస్యని పరిష్కరించారు. హీరోయిన్ పాత్ర ప్రధానంగా ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని చేయడానికి ఉదయనిధి స్టాలిన్ ధైర్యంగా ముందుకు వచ్చారని శీను రామస్వామి ప్రశంసించారు.

 ధైర్యం కలిగిన అమ్మాయి

ధైర్యం కలిగిన అమ్మాయి

ఈ చిత్రంలో తమన్నా చాలా ధైర్యం కలిగిన అమ్మాయి. తమన్నా పాత్రని ఎలా హైలైట్ చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో నా మనసులో జయలలిత మెదిలారు అని శీను రామస్వామి అన్నారు. వెంటనే జయలలిత లక్షణాలతో తమన్నా పాత్రని, సన్నివేశాల్ని రూపొందించినట్లు శీను తెలిపారు. అనుష్క, నయనతార లాంటి హీరోయిన్లంతా లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు తమన్నా చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X