ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చైనా 'దూకుడు' దక్కించుకోవాలంటున్న హీరో
టాలీవుడ్ టాప్ దర్శకల జాబితాలో శ్రీను వైట్ల చేరిపోయాడు. అతని దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన 'దూకుడు" చిత్రం ఘన విజయం సొంతం చేసుకోవడంతో శ్రీనువైట్ల రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఎంతటా పెరిగిపోయిందంటే ఇకపై సెకండ్ గ్రేడ్ హీరోలకు శ్రీనువైట్ల దొరకుడు, ఇటు తమిళ, అటు హిందీ హీరోల మనుస్సులను దోచేసేంతగా పెరిగిపోయింది.
ఈమధ్య కాలంలో ఒక పెద్ద హీరో నటించిన తెలుగు సినిమా రిలీజ్ అవుతోందంటే తమిళ, హిందీ చిత్ర రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దానికి కారణం... ఒకవేళ ఏదైనా సినిమా హిట్ అయితే, రీమేక్ హక్కుల కోసం వెంటనే హైదరాబాదు వచ్చి వాలడం కోసం!ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమా మీద కూడా చాలా మంది దృష్టిపెట్టారు.
ముఖ్యంగా, కోలీవుడ్ ముగ్గరు టాప్ హీరోలు ఈ సినిమా గురించి ఎంక్వయిరీ చేస్తున్నారట. విజయ్, శింబు, అజిత్, మరియు జయం రవి వీరిలో హీరో విజయ్ అందరి కంటే కాస్త ముందున్నాడని తెలుస్తోంది. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా హక్కులు పొందడానికి ట్రై చేస్తున్నాడని వినికిడి. సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అతను రైట్స్ కోసం ట్రై చేస్తున్నాడట. ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సంపాదించి హీరోల్లో ఎవరో ఒక్కరి డేట్స్ సంపాదించి సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. అలాగే, హిందీలో షరా మామూలుగా సల్మాన్ ఖాన్ కూడా దీని గురించి ఎంక్వయిరీ చేస్తున్నాడు. అయితే, 'దూకుడు' రీమేక్ రైట్స్ భారీగానే చెబుతున్నారని అంటున్నారు!


Click it and Unblock the Notifications











