క్యాన్సర్‌తో యువ నటుడు కన్నుమూత.. తీవ్ర దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ

క్యాన్సర్ మహమ్మారితో తమిళ సినీ పరిశ్రమలో మరో యువ నటుడు ఆనంద కన్నన్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాయి. ఇక ఆయన లేరనే వార్తతో షాక్ గురయ్యారు. యువ నటుడి మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆవేదనకు గురయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శ్రద్దాంజలి ఘటించారు. ఆనంద కన్నన్ గురించి వివరాల్లోకి వెళితే...

ఆనంద కన్నన్ టెలివిజన్ హోస్ట్‌గా తమిళ ప్రేక్షకులకు సుపరిచితులు. సన్ నెట్‌వర్క్‌లో పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. సినీ రంగంలోకి ప్రవేశించారు. సింగపూర్‌లోని వసంతం టీవీలో సవాల్ సింగపూర్ అనే షోతో ఆనంద కన్నన్ కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత చెన్నైకి తన మకాం మార్చి సన్ మ్యూజిక్‌లో వీడియో జాకీగా పనిచేశారు. అధిసాయ ఉలగమ్ అనే సినిమాతో కోలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ముల్లమ్ మలరమ్ చిత్రంలో నటించారు. సరోజా, ఇతనై నాలై ఇంగిరుతై చిత్రాల్లో నటించి ఆకట్టుకొన్నారు. వెంకట్ ప్రభు రూపొందించిన సరోజ చిత్రంలో గెస్ట్‌గా కనిపించారు. నేచురల్ స్పా అండ్ సెలూన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సింగపూర్ మీడియా కార్పోరేషన్ చానెల్‌లో సవాల్ సింగపూర్ అనే షోను నిర్వహిస్తున్నారు.

Tamil Actor Anandha Kannan died at age of 48 due to Cancer

తమిళ వినోద పరిశ్రమలో కెరీర్ పరంగా నిలదొక్కుకొంటున్న సమయంలోనే ఆనంద్ కన్నన్ క్యాన్సర్ బారిన పడ్డారు. దాంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ట్రిట్‌మెంట్ తీసుకొంటూ కోలుకొనే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆగస్టు 16వ తేదీ రాత్రి కన్నుమూశారు.

Recommended Video

ఎఫైర్ అన్నా ఓకే.... ఆ మాట మాత్రం అనొద్దు ప్లీజ్..

ఆనంద కన్నన్ మృతిపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ... తమిళ ప్రముఖులు రమ్య ఎన్ఎస్కే, ఆర్జే ధీనా, రాఘవేంద్రన్ పులి, ప్రతీ సంజీవ్ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రమ్య ఎన్‌స్కే సోషల్ మీడియాలో స్పందిస్తూ.. నాకు ఆనంద్ కన్నన్ సోదరుడు, తండ్రి, నా శ్రేయోభిలాషి. స్నేహితుడి కంటే ఎక్కువ. నా బాధలు, సంతోషాల్లో పాలుపంచుకొన్నాడు. నా ప్రతీ విషయాన్ని సానుకూలంగా వింటూ వాటికి పరిష్కారం సూచించేవాడు. నటుడు సత్యతో నా పెళ్లి ఆయన చేతులు మీదుగానే జరిగింది అంటే ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన గొప్ప మనిషి. అలాంటి వ్యక్తి మా మధ్యలో లేరంటే నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని రమ్య ఎన్‌ఎస్కే తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X