అల్లు అర్జున్ విలన్ భలే రొమాంటిక్.. అఖిల్ హీరోయిన్‌తో ఎఫైర్, త్వరలో పెళ్లి.. ఏజ్ గ్యాప్ ఎంతంటే!

సినీ తరాల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎపుడూ జరిగేదే. కానీ కొన్ని జంటలు ఎవరూ ఊహించని విధంగా ఒక్కటవుతుంటారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు అప్పుడే ఓ యంగ్ బ్యూటీ ప్రేమ వ్యవహారాలు సాగించి పెళ్లి వరకు వచ్చేసిందనే వార్తలు జోరందుకుంటున్నాయి. అతి త్వరలో ఈ జంట పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ హీరో ఆర్య, యంగ్ బ్యూటీ సాయేషా సైగల్ గురించే ఇదంతా.. వివరాల్లోకి వెళదాం!

ఘాటు రొమాన్స్‌తో హాట్ టాపిక్

ఘాటు రొమాన్స్‌తో హాట్ టాపిక్

తమిళ చిత్రం గజినీకాంత్ లో ఆర్య, సాయేషా సైగల్ జంటగా నటించారు. ఈ చిత్రంలో సాయేషా, ఆర్య మధ్య రొమాన్స్ హాట్ టాపిక్ గా నిలిచింది. సాయేషా అందాల ఆరబోతలో ఈ చిత్రంలో చెలరేగిపోయింది. గత ఏడాది ఈ చిత్రం విడుదలయింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఆ రూమర్లు త్వరలోనే నిజం కాబోతున్నాయని తమిళ మీడియా కోడై కూస్తోంది.

పెద్దల అంగీకారం

పెద్దల అంగీకారం

ఘాడమైన ప్రేమని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. దీనితో కుటుంబ సభ్యులకు కూడా తమ ప్రేమ గురించి వివరించినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు ఈ జంట వివాహానికి అంగీకారం తెలిపారట. ప్రస్తుతం ఆర్య కెవి ఆనంద్ దర్శత్వంలో తెరకెక్కుతున్న కాప్పాన్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయేషా తల్లి ఆర్యని కాప్పాన్ సెట్స్ లో ఇటీవల కలిసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ప్రకటన

త్వరలోనే ప్రకటన

ఆర్య, సాయేషా సైగల్ వివాహం గురించి వారి కుటుంబ సభ్యులు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉందా ఆర్య, సాయేషా సైగల్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆర్య ప్రస్తుతం వయసు 38 ఏళ్ళు. సాయేషా కేవలం 21 ఏళ్ల కుర్ర భామ. వీరిద్దరి మధ్య దాదాపు 17 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది.

అఖిల్ చిత్రంతో

అఖిల్ చిత్రంతో

సాయేషా సైగల్ 2015లో విడుదలైన అఖిల్ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ చిత్రం నిరాశపరచడంతో తమిళ సినిమాలపై ద్రుష్టి పెట్టింది. సాయేషాకు మంచి డాన్సర్ గా గుర్తింపు ఉంది. తరచుగా తన డాన్స్ వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులని అలరించేది. ఇక ఆర్య రాజా రాణి చిత్రంతో గుర్తింపు పొందాడు. అల్లు అర్జున్ చిత్రం వరుడులో ఆర్యనే విలన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X