Just In
Don't Miss!
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కండలు తిరిగిన దేహం.. అదిరిపోయిన హీరో ప్రీ లుక్
తమిళ నటుడు ఆర్య తెలుగు వారందరికీ పరిచయమే. వరుడు సినిమాలో అల్లు అర్జున్‌ను ఢీ కొట్టి.. నేను అంబాని చిత్రంతో అందర్నీ మెప్పించాడు. అయితే మళ్లీ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నా.. అవి తెలుగులోకి అనువదిస్తున్నా విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. చివరగా సూర్య హీరోగా వచ్చిన బందోబస్త్ సినిమాలో కనిపించాడు.
హీరో ఆర్య, సాయేషా సైగల్ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు బందోబస్త్ చిత్రంలోనూ కలిసి నటించారు. ఆ మూవీ షూటింగ్‌లో ఉండగానే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకులు కోలీవుడ్‌లో ఘనంగా జరిగాయి. సినీ ప్రముఖుల మధ్య అంగరంగవైభవంగా జరిగింది. ఆర్య తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు.
“You Never know how strong You are until Being strong is the only choice you have”
— Arya (@arya_offl) February 19, 2020
An Update about my next film at 5pm tomorrow #Arya30 #Prelook pic.twitter.com/I78DyhzRQY

ఆర్య.. తన కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించాడు. అంతేకాకుండా ఓ ఆసక్తికరమైన కొటేషన్‌ను కూడా రాసుకొచ్చాడు. మీరెంత బలమైన వారో.. బలంగా తయారయ్యేవరకు తెలుసుకోలేరు.. అదొక్కటే దారి ఉందంటూ రేపు సాయంత్రం ఐదు గంటలకు తన మూవీ అప్‌డేట్ రాబోతోందని ట్వీట్ చేశాడు.