Meena: స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి.. చిన్నోడే అయినా సహజీవనం.. తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు

మీనా.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఆమె దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోన్నారు. ఇప్పటికీ నటనను కంటిన్యూ చేస్తోన్న ఈ సీనియర్ హీరోయిన్.. వరుస సినిమాలతో వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీనా గత ఏడాది భర్తను కోల్పోయారు. అప్పటి నుంచి ఆమె రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీనా ఓ స్టార్ హీరోను త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీరే చూడండి!

చైల్ట్ ఆర్టిస్టు నుంచి స్టార్‌గా

చైల్ట్ ఆర్టిస్టు నుంచి స్టార్‌గా


మీనా చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె చాలా భాషల్లో ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించారు. తర్వాత తెలుగు చిత్రం ద్వారానే హీరోయిన్‌గా మారారు. అనంతరం సౌత్‌లోని అన్ని భాషల్లోనూ పరిచయమయ్యారు. ఇక, తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన మీనా.. ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

 మీనా భర్త సాగర్ మరణం

మీనా భర్త సాగర్ మరణం


కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే మీనా.. విద్యా సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీళ్లిద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఓ పాపకు జన్మనిచ్చారు. అంతా సవ్యంగా సాగిపోతోన్న సమయంలోనే మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్‌లో మరణించారు. చాలా కాలంగా శ్యాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడిన ఆయన.. కరోనా బారిన పడడంతో ప్రాణాలు కోల్పోయారు.

వరుస ఆఫర్లు.. తెలుగులో

వరుస ఆఫర్లు.. తెలుగులో


భర్త విద్యాసాగర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే కెరీర్‌కు విరామం తీసుకున్న మీనా... ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో వస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే సినిమాలో నటించారు. అలాగే, 'రౌడీ బేబీ' అనే తమిళ చిత్రంతో పాటు మలయాళంలో 'జనమ్మ డేవిడ్' అనే సినిమాను చేశారు. ఇలా బిజీగా గడుపుతోన్నారు.

 రెండో పెళ్లి.. ఖండించినా

రెండో పెళ్లి.. ఖండించినా


భర్త మరణం తర్వాత మీనా రెండో పెళ్లి గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఆమె రెండో పెళ్లికి సిద్ధం అయిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె 'నేను విచారంలో ఉన్నాను. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మా కుటుంబ గోప్యతకు భంగం కల్పించకూడదని కోరుతున్నా. అలాగే, నా రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదు' అని చెప్పారు.

తమిళ నటుడు కామెంట్

తమిళ నటుడు కామెంట్


ఒకవైపు సీనియర్ హీరోయిన్ మీనా తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని చెబుతున్నా.. దీనిపై వార్తలు మాత్రం అస్సలు ఆగడం లేదు. తరచూ ఎవరో ఒకరు ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చిన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిటిక్, నటుడు బయిల్వాన్ రంగనాథన్ మీనా మళ్లీ పెళ్లి చేసుబోతోందని కామెంట్ చేశారు.

ఆ స్టార్ హీరోతోనే అంటూ

ఆ స్టార్ హీరోతోనే అంటూ


క్రిటిక్, నటుడు బయిల్వాన్ రంగనాథన్ యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన ఎంతో మంది నటీనటుల పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'మీనా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. కోలీవుడ్‌లో ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ హీరోతోనే ఆమె జతకట్టబోతుంది' అని సంచలన కామెంట్ చేశారు.

జూలైలోనే పెళ్లి.. వివాదం

జూలైలోనే పెళ్లి.. వివాదం


అంతేకాదు, ఆ వీడియోలో బయల్వాన్ 'మీనా ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. అలాగే, ఆ స్టార్ హీరో కూడా ఒంటరిగానే ఉంటున్నాడు. కాబట్టి ఒకరి అవసరం ఒకరు తెలుసుకుని వీళ్లిద్దరూ వచ్చే జూలైలో వివాహం చేసుకోబోతున్నారు. త్వరలోనే వీళ్లు సహజీవనం కూడా మొదలు పెట్టబోతున్నారు' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇది వివాదంగా మారి.. అతడిపై విమర్శలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X