సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో సత్తా చాటిన కమెడియన్ కొడుకు.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్

సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న నటీనటుల వారసులు ఎక్కువ శాతం ఎదో ఒక విధంగా సినిమాలకు సంబంధించిన పనులు చేయడానికి ఇష్టపడతారు. ఇతర రంగాల్లో సత్తా చాటేవారు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఇటీవల ఒక కమెడియన్ కొడుకు సివిల్స్ లో సత్తా చాటాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ అందుకోవడంతో రజినీకాంత్ కూడా కూడా ఫిదా అయ్యారు.

సివిల్స్ లో 75వ ర్యాంక్

సివిల్స్ లో 75వ ర్యాంక్

ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఒక కమెడియన్ కొడుకు పేరు హాట్ టాపిక్ గా మారింది. సృజన్ జయ్ ఆమె యువకుడు సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుడై జాతీయ స్థాయిలో 75వ ర్యాంక్ అందుకున్నాడు. ఈ యువ తేజం మరెవరో కాదు. తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్స్ లలో ఒకరైన చిన్న జయంత్ కుమారుడు.

 90ల కాలంలో బిజీ యాక్టర్ గా..

90ల కాలంలో బిజీ యాక్టర్ గా..

చిన్ని జయంత్ 90ల కాలంలో బిజీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని అనువాద సినిమాలతో కూడా తెలుగు ఆడియెన్స్ కి కూడా పరిచయమయ్యారు. జయంత్ నటుడిగా ఉన్నప్పటికీ ఆయన కుమారుడు మాత్రం ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టారు. ఎలాగైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఇంటర్ నుంచే సివిల్స్ లో సత్తా చాటాలని గోల్ పెట్టుకున్నాడు.

మొదటి ప్రయత్నంలోనే..

మొదటి ప్రయత్నంలోనే..

మొదటి ప్రయత్నంలోనే సృజన్ సివిల్స్ లో అద్భుతమైన ర్యాంక్ సాధించడం విశేషమని చెప్పాలి. ఒక విధంగా తండ్రిని గర్వపడేలా చేసిన సృజన్ కి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమ నుంచి భారీ స్థాయిలో విషెస్ అందుతున్నాయి. రజినీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్స్ కూడా ఆ యువకుడిని సోషల్ మీడియా ద్వారా అభినందించారు.

Recommended Video

Kushboo Made Comments on Rajinikanth's Political Entry
 రజినీకాంత్ ఫిదా..

రజినీకాంత్ ఫిదా..

ఇక రాజినీకాంత్ స్పందిస్తూ.. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుడై జాతీయ స్థాయిలో 75వ ర్యాంక్ అందుకున్న చిన్ని జయంత్ కుమారుడు సృజన్ కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ లాక్ డౌన్ లేకపోయి ఉంటే తప్పకుండా ఇంటికి వచ్చి అభినందించే వాడిని. నీ తల్లిదండ్రులను గర్వపడేలా చేసినందుకు నేను కూడా గర్వపడుతున్నాను అని రజినీకాంత్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X