'ప్రేమిస్తే ' విలన్ దండపాణి మృతి
హైదరాబాద్: భరత్, సంధ్య కాంబినేషన్ లో రూపొందిన 'ప్రేమిస్తే ' చిత్రంలో విలన్ గా చేసిన దండపాణి ని ఎవరూ మర్చిపోరు. ఆయన ఈ ఉదయం చెన్నైలో మరణించారు. ఆ తర్వాత ఆయన ముని, రవితేజ కృష్ణ వంటి చాలా తెలుగు చిత్రాల్లో ఆయన విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. రేపు దిండిగల్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
తమిళ (ప్రేమిస్తే) కాదల్ చిత్రంతో తమిళ చిత్రసీమలో ప్రవేశించిన దండపాటి చితిరమ్ పెసుతాడి, విట్టారం, ముని, వేలాయుధం, తెలుగులో రాజు భాయ్, ఆంజనేయులు, కృష్ణ, ప్రేమిస్తే చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ నటిస్తున్న సందమారుతం చిత్రంలో నటిస్తున్నారు. మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా దండపాణి నటించారు.

కాదల్ దండపాణి మరణవార్తను శరత్ కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. దండపాణి అంత్యక్రియలు స్వస్థలం దిండిగల్ లో నిర్వహించనున్నారు. దండపాణి మృతి వార్తతో తమిళ చలన చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. తెలుగు,తమిళ చిత్రాలతో కలిపి ఆయన 160 చిత్రాలు వరకూ చేసారు. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











