For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గృహ హింస కేసులో నటుడి అరెస్ట్.. భార్యపై దాడి.. ఫిర్యాదుతో కటకటాలు

    |

    గృహ హింస, భార్యపై శారీరక దాడి ఆరోపణలపై తమిళ నటుడు ఈశ్వర్ రఘునాథన్‌ను తమిళనాడు పోలీసుల అరెస్ట్ చేశారు. భార్య జయశ్రీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. యువ నటుడు ఈశ్వర్ అరెస్ట్ వార్త కోలీవడ్‌లో సంచలనం రేపింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    భార్యతో విభేదాలు

    భార్యతో విభేదాలు

    నటుడు ఈశ్వర్ రఘునాథన్‌తో జయశ్రీ రావు వివాహం 2016లో జరిగింది. కొద్దికాలంగా వారి మధ్య కలతలు చోటుచేసుకోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ఆమె ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకొని రూ.30 లక్షలు లోన్ తీసుకొవడం జరిగింది. లోన్ క్లియర్ చేయకపోవడం, ఆర్థిక సమస్యలు పెరిగిపోవడంతో గొడవలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి అని పోలీసులు తెలిపారు.

    శారీరక దాడితో హాస్పిటల్‌లో

    శారీరక దాడితో హాస్పిటల్‌లో

    వ్యక్తిగతం విభేదాల నేపథ్యంలో తన తల్లి సహాయంతో భార్య జయశ్రీపై ఈశ్వర్ రఘునాథన్‌ శారీరక హింసకు పాల్పడ్డారు. తీవ్రంగా దాడి చేసిన క్రమంలో చెన్నైలోని అడయార్‌లోని హాస్పిటల్‌లో చేరారు. గాయాల బారి నుంచి కోలుకొన్న తర్వాత ఆడయార్ ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ఈశ్వర్ రఘునాథన్‌ను అరెస్ట్ చేశారు అని తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

    డిసెంబర్ 1న అరెస్ట్

    డిసెంబర్ 1న అరెస్ట్

    భార్య జయశ్రీ ఫిర్యాదు ఆధారంగా రఘునాథన్‌పై తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ ఉమెన్ హర్రాస్‌మెంట్ యాక్ట్, సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు. చెన్నైలోని తిరువాన్మియార్‌లోని తన నివాసం నుంచి డిసెంబర్ 1వ తేదీన ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు కథనాలు వెలువడ్డాయి.

    #CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
     జయశ్రీ,, ఈశ్వర్ రఘునాథన్ కెరీర్

    జయశ్రీ,, ఈశ్వర్ రఘునాథన్ కెరీర్

    తమిళంలో ఆఫీస్ అనే చిత్రంతో ఈశ్వర్ రఘునాథన్ తన కెరీర్‌ను ఆరంభించారు. నామ్ ఇరువర్, నమ్మక్కు ఇరువార్, రాజా రాణి, కల్యాణం ముధల్ కాదల్ వరై, దేవథైయై కండెన్, కల్యాణ పరిసు, నామ్ ఇరువుర్ నమ్మక్కు ఇరువార్ అనే చిత్రాల్లో నటించాడు. జయశ్రీ తమిళ టెలివిజన్ సీరియల్ ఇల్లవరసీలో నటించారు. పావ, మన్నుప్పు, దేవతై వామ్నమ్, సూపర్ మామ్ అనే రియాలిటీ షోలో నటించింది.

    English summary
    Tamil actor Iswar Raghunathan has been arrested on Sunday, 1 December, for allegedly assaulting his wife Jayashree Rao. The couple lives in Tiruvanmiyur area in Chennai, IBtimes reported.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X