నిన్న హీరో, డైరక్టర్ ల పెళ్ళిళ్లు..హంగామా
ఆదివారం తమిళ చిత్ర పరిశ్రమలో రెండు వివాహాలు చోటు చేసుకున్నాయి. సూర్య సోదరుడు కార్తి, మరియు దర్శకుడు సెల్వరాఘవన్ ('7/జీ బృందావన కాలనీ' ఫేమ్)వివాహం ఒకేసారి జరిగాయి. దాంతో వివాహ వేడుకకు తమిళ పరిశ్రమలోని ప్రముఖలంతా హడావిడిగా అటూ ఇటూ తిరగాల్సి వచ్చింది. ఇక కార్తీ వివాహం కోయంబత్తూరులో ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త కుమార్తె రంజనీని ఆయన వివాహం చేసుకున్నారు. ఇక సెల్వరాఘవన్ రెండో వివాహం ఆదివారం చెన్నైలోని ఓ హోటల్లో జరిగింది. ప్రముఖ న్యాయవాది కుమార్తె గీతాంజలి మెడలో తాళి కట్టారు. ఈ వివాహ వేడుకకు తమిళ పరిశ్రమ తరిలి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.


Click it and Unblock the Notifications











