బిగ్‌బాస్ సెలబ్రిటీకి తీవ్ర విషాదం.. జీవితంలో దేనిని ఊహించలేం అంటూ..
తమిళ వినోద రంగంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ యువ నటుల్లో యాక్టర్ కెవిన్ ఒకరు. అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తమిళంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రేక్షకదరణను సొంతం చేసుకొన్నారు. అలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో ఓ వార్త ఆయనను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇంతకు ఆయనను తీవ్రంగా విషాదానికి గురిచేసిన విషయం ఏమిటంటే..

యాక్టర్ కెవిన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్
యాక్టర్ కెవిన్‌కు తమిళనాడులోని యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనకు కమల్ రాజ్ అనే వీరాభిమాని ఉన్నాడు. కమల్ కొద్ది రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించారు. ఆ వార్త తెలిసిన వెంటనే కెవిన్ తీవ్రంగా మనో వేధనకు గురయ్యాడు. అభిమాని కుటుంబాన్ని వ్యక్తిగతం పరామర్శించారు.

అభిమాని మృతితో
అభిమాని కమల్ మృతితో విషాదంలో కూరుకుపోయిన కెవీన్ తాజాగా తన ఆవేదనను ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జీవితంలో దేనిని ఊహించలేం. ఎప్పుడు ఏమౌతుందో చెప్పలేం. కాబట్టి మీ సన్నిహితులను, ఇష్టపడే వారిని ఎప్పుడు సంతోషంలో ఉంచడానికి ప్రయత్నించండి. ఎక్కడ ఉన్నా నీవు ప్రశాంతంగా ఉండాలి కమల్ రాజ్ అంటూ సంతాప సందేశాన్ని ట్వీట్ చేశారు.

జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ
కెవిన్ అభిమాని మృతివార్తతో కెవిన్‌తోపాటు పలువురు దు:ఖంలో మునిగిపోయారు. కమల్ రాజ్ మరణాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ అభిమాని మృతి స్థానికంగా విషాదాన్ని పంచారనే విషయం మీడియాలో వైరల్‌గా మారింది.
Recommended Video


యాక్టర్ కెవిన్ గురించి..
ఇక కెవిన్ కెరీర్ విషయానికి వస్తే.. తమిళ టెలివిజన్ రంగంలో యువ నటుడు, యాంకర్‌కు మంచి క్రేజ్ ఉంది. శరవణన్ మీనాక్షి అనే ధారావాహికలో వెట్టైయాన్ అనే పాత్రతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న డాక్టర్ అనే చిత్రంలో శివకార్తీకేయన్‌తో కలిసి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











