యువ నటుడికి గుండెపోటు.. పరిస్థితి విషమం

తమిళ నటుడు, వీడియో జాకీ లోకేష్‌కు తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయన వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స జరుగుతున్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర అనారోగ్యానికి గురైన లోకేష్‌ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రస్తుతం లోకేష్ పరిస్థితి ఎలా ఉందంటే..

Recommended Video

Young Comedy Actor Admitted To ICU | Filmibeat Telugu
పాక్షికంగా పక్షవాతంతో

పాక్షికంగా పక్షవాతంతో

నటుడు లోకేష్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. గుండెపోటు కారణంగా పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు. ఎడమ చేతి, కాలు పాక్షికంగా పనిచేయడం లేదు. చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడేలా వైద్యులు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు అని కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్కొన్నారు.

విఘ్నేష్ శివన్, నయనతార మూవీలో

విఘ్నేష్ శివన్, నయనతార మూవీలో

పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్న లోకేష్‌కు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన నానమ్ రౌడీ ధాన్ మంచి పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి, నయనతార నటించిన ఈ చిత్రంలో తనదైన నటనను లోకేష్ ప్రదర్శంచారు. డైలాగ్స్ పెద్దగా లేకున్నా తన హావభావాలతో ఆకట్టుకోవడమే కాకుండా సినీ విమర్శకులను మెప్పించారు. నానమ్ రౌడీ ధాన్ సినిమా తర్వాత లోకేష్ బిజీగా మారిపోయారు.

వీడియో జాకీగా

వీడియో జాకీగా

తమిళ వినోద రంగంలో నటుడిగానే కాకుండా టెలివిజన్ ఛానెల్‌లో పలు షోలు నిర్వహించారు. ఆయన నిర్వహించిన టీవీ కార్యక్రమాలకు మంచి ఆదరణ దక్కింది. టీవీ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత సినిమాల్లో బిజీగా మారిపోయారు. కెరీర్ సవ్యంగా సాగుతుందనుకునే క్రమంలో ఇలా గుండెపోటుకు గురికావడంతో లోకేష్ సన్నిహితులు దిగ్బ్రాంతికి లోనయ్యారు.

షాక్‌కు గురైన సినీ ప్రముఖులు

షాక్‌కు గురైన సినీ ప్రముఖులు

లోకేష్ గుండెపోటుకు గురయ్యారనే వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు షాక్ గురయ్యారు. సోదరుడి లాంటి మా లోకేష్‌కు ఇలాంటి పరిస్థితి రావడం చాలా విషాదం. ఆయన త్వరగా కోలుకోవాలి. ఆయనకు సహాయం అందించడానికి ముందుకు రావాలి అంటూ సహచర నటీనటులు, సన్నిహితులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X