ప్రముఖ హాస్య నటుడు మనోబాల మృతి.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ.. మరణానికి కారణం ఏమిటంటే?

దక్షిణాదిలో ప్రముఖ నటుడు, డైరెక్టర్ మనోబాల ఇక లేరు. గత కొద్దికాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో బుధవారం (మే 3వ తేదీన) మరణించారు. ఆయన మరణంతో దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఇకలేరనే వార్తతో స్నేహితులు, సన్నిహితులు,శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో సంతాపం తెలియ జేస్తున్నారు. మనోబాల వ్యక్తిగత, ప్రొఫెషనల్, మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నివాసంలో భౌతికకాయం: మనోబాలకు భార్య ఉష, కుమారుడు హరీష్ ఉన్నారు. కాలేయం, వృద్దాప్య సంబంధింత వ్యాధులతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం ఆయన శాశ్వత నిద్రలోకి వెళ్లారు. ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని సాలిగ్రామమ్‌లోని ఎల్వీ ప్రసాద్ రోడ్డులోని తన నివాసంలో ఉంచారు. మరణవార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్నికి శ్రద్దాంజలి ఘటించారు.

Manobala

1979లో నటుడిగా సినీ రంగ ప్రవేశం : మనోబాల 1979లో భారతీరాజా దర్శకత్వం వహించిన పుతియా వారుపుగల్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. గత 35 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ప్రత్యేకమైన హాస్యశైలికి ఆయన పెట్టింది పేరు. తనదైన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించారు.తన కెరీర్‌లో సుమారు 450 సినిమాలకుపైగా నటించారు.

 Manobala

కాజల్ అగర్వాల్ ఘోస్ట్ సినిమాలో : ప్రముఖ నటుడు కమల్ హాసన్ సూచన మేరకు భారతీరాజా వద్ద మనోబాలా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. ఆ తర్వాత నటనారంగంలోకి అడుగుపెట్టారు. ఆయన చివరిసారిగా నటించిన చిత్రం కాజల్ అగర్వాల్ నటించిన సినిమా ఘోస్ట్. విభిన్న పాత్రలకు, వెరైటీ కామెడీకి ఆయన పెట్టింది పేరుగా సినీ ప్రముఖులు చెప్పుకొంటారు.

 Manobala

దక్షిణాదిలో ప్రముఖ నటుడు, డైరెక్టర్ మనోబాల ఇక లేరు. గత కొద్దికాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో బుధవారం (మే 3వ తేదీన) మరణించారు. ఆయన మరణంతో దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఇకలేరనే వార్తతో స్నేహితులు, సన్నిహితులు,శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో సంతాపం తెలియ జేస్తున్నారు. మనోబాల వ్యక్తిగత, ప్రొఫెషనల్, మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Manobala

1982లో దర్శకుడిగా..: నటుడిగా కొనసాగుతూనే మనోబాలా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. 1982లో ఆగయ గంగై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 25 చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు. పిళ్లై నిలా, ఊకావాలన్, ఎన్ పురుషంతాన్, ఎనక్కు ముత్తుంహాన్, కురుప్పు వెల్లై, మల్లు వెట్టి మైనర్, పారంబరీయం చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కేవలం ఆయన సినీ తెరకే పరిమితం కాలేదు. పలు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు. 2022లో కూకు కోమలి అన సీరియల్‌కు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

రజనీకాంత్ నటించిన కథానాయకుడులో: రజనీకాంత్ నటించిన కథానాయకుడు సినిమా ద్వారా తెలుగులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ నటించిన పున్నమినాగు, అనంతరం మనసు మాయ సేయకే, డేగ, థోజా, రాజాధిరాజా, నాయకి, మహానటి, సీమ రాజా, రాజ్‌దూత్, కాలేజ్ కుమార్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. చంద్రముఖి లాంటి పలు తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X