twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా కాటుకు మరో కమెడియన్ మృతి... రజనీ, అజిత్, విజయ్‌తో...

    |

    కరోనావైరస్ ధాటికి సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకొన్నది. తమిళ సినిమా పరిశ్రమలో అనేక విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొన్న నటుడు, కమెడియన్ పాండు ఇకలేరు. కరోనావైరస్ బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. హాస్పిటల్‌ నుంచి నేరుగా శ్మశాన వాటికకు ఆయన పార్ధీవ దేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆయన అంత్యక్రియలు బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో జరుగనున్నాయి.

    సాక్షి అగర్వాల్.. అమ్మాయి నడుమంటే ఇలా ఉండాలి

    కొద్ది రోజుల క్రితం పాండు, ఆయన భార్య కుముదాకు కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన భార్య ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు అని సన్నిహితులు తెలిపారు. పాండు మ‌ృతి వార్తను నటుడు మనోబాలా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

    Tamil Actor Pandu died with Corona Positive at Chennai

    పాండు వయసు 71 సంవత్సరాలు. ఆయనకు ప్రభు, పంచు, పింటూ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. నటుడిగా పాండు పలు విభిన్నమైన పాత్రలను పోషించారు. రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్‌స్టార్స్‌తో నటించారు. అజిత్ నటించిన కాదల్ కొట్టై చిత్రంలో పాండు పోషించిన పాత్రకు విశేష ఆదరణ దక్కింది. విజయ్ నటించిన గిల్లీ లాంటి చిత్రాల్లో నటించారు.

    నటనతోపాటు క్యాపిటల్ లెటర్స్ అనే వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా సినీ తారల ఇండ్లకు, ఆఫీసులకు డిజైనింగ్ నేమ్ బోర్డ్స్ చేస్తూ వ్యాపారం చేశారు. అంతేకాకుండా అన్నాడిఎంకే పార్టీ గుర్తు రెండాకులు డిజైన్ చేసింది పాండు కావడం విశేషం.

    English summary
    Tamil Actor Pandu died with Corona Positive at Chennai. Few days ago, Pandu and his wife Kumuda tested coronavirus positive. Since then they are getting treatment at a private hospital in Chennai. His wife continues to be in the ICU. Actor Manobala tweeted that, Rip Pandu..He passed away early morning today due to covid.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X