రామ్ చరణ్, ప్రభాస్ లతో చంద్రముఖి భర్త!
తమిళ స్టార్ ప్రభు గణేషన్ తాజాగా స్ట్రయిట్ చిత్రాలతో తెలుగులో అడుగుపెడుతున్నారు. తమిళంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన ప్రభు తెలుగు ప్రేక్షకులకు మాత్రం సుపరిచితుడే. అయితే ఇంత వరకు ఆయన అనువాద చిత్రాల ద్వారా మాత్రమే మన ముందుకు వచ్చారు. 'ఘర్షణ", 'చంద్రముఖి" వంటి అనువాద చిత్రాల్లో ప్రభు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఆయన రెండు స్ట్రయిట్ చిత్రాల్లో కీలకమైన పాత్ర పోషించేందుకు అంగీకరించారు. రామ్ చరణ్ 'ఆరెంజ్" లోనూ, ప్రభాస్ 'డార్లింగ్" చిత్రంలోనూ ఈయన కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.
ప్రభు రామ్ చరణ్ తేజ్ జెనీలియా ప్రభాస్ ఆరెంజ్ డార్లింగ్ జ్యోతిక prabhu ram charan teja genelia prabhas orange darling jyothika


Click it and Unblock the Notifications