తమిళ ఇండస్ట్రీలో విషాదం.. పాపులర్ నటుడు కన్నుమూత!

ప్రముఖ కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్ఎన్ఆర్ మనోహర్ గుండెపోటుతో ఈరోజు కన్నుమూశారు. మనోహర్ కి 61 ఏళ్లు. ఆయన ఎలా మరణించారు? ఆయనకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే

అందుతున్న సమాచారం మేరకు మనోహర్ COVID-19 బారిన పడ్డారు. దీంతో ఆయన త ఇరవై రోజులుగా చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్‌ఎన్‌ఆర్ మనోహర్ 'బ్యాండ్ మాస్టర్' మరియు 'సూరియన్ చంద్రన్' చిత్రాలలో ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్‌కు అసిస్టెంట్‌గా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. మనోహర్ 90వ దశకంలో పలు చిత్రాలకు సహ దర్శకత్వం వహించారు. రచయితగా, ఆయన 'తెన్నవన్' మరియు 'పున్నగై పూవే' సహా అనేక చిత్రాలకు పనిచేశారు. నకుల్ మరియు సునైనా నటించిన 'మాశిలామణి' (2009), సోలో డైరెక్టర్‌గా మనోహర్‌కి మొదటి సినిమా. ఆ తర్వాత నటనపై దృష్టి సారించిన మనోహర్ 'యెన్నై అరిందాల్', 'వీరమ్', 'తీరన్ అధిగారం ఒండ్రు', 'మిరుతన్', 'భూమి', 'టెడ్డీ', 'విశ్వాసం' మరియు 'కైతి' వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.

 Tamil actor RNR Manohar passes away at 54

మనోహర్ డిఎంకె నాయకుడు ఎన్ఆర్ ఎలంగోవన్ తమ్ముడు కూడా. మనోహర్ కి భార్య ఉన్నారు. ఈ దంపతులు 2012లో తమ కొడుకు రంజన్‌ను 10 ఏళ్ల వయసులో కోల్పోయారు. మనోహర్ మృతికి పలువురు కోలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్‌లో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులర్పించారు. సంగీత స్వరకర్త డి ఇమ్మాన్ ఆర్‌ఎన్‌ఆర్ మనోహర్‌ని సమర్థవంతమైన దర్శకుడు మరియు దయ గల వ్యక్తి అని పేర్కొన్నారు.

ఆర్య నటించిన 'టెడ్డీ' చిత్రంలో ఆర్‌ఎన్‌ఆర్ మనోహర్ చివరిగా నటించారు. ఆ సినిమాలో ఆయన సయేషా తండ్రిగా నటించాడు. ఆయన నూతన దర్శకుడు తూ పా శరవణన్ దర్శకత్వంలో విశాల్ 'వీరమే వాగై సూదుం'లో కనిపించనున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ నెల రోజుల క్రితమే పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మనోహర్ తన కెరీర్ లో 50కి పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో కాంచన 3, అయోగ్య, కాపాన్, కితి, భూమి, టెడ్డీ, ధిల్, వీరమ్, సలీం, మిరుతన్ మరియు అందవన్ కట్టలే ఉన్నాయి. 2009లో విడుదలైన మాసిలామణి స్వతంత్ర దర్శకుడిగా మనోహర్‌కు తొలి చిత్రం. 2011లో వెల్లూర్ మావట్టం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X