షాకింగ్: యువ నటుడు కన్నుమూత.. శోకసంద్రంలో సినీ ప్రముఖులు

వర్ధమాన నటుడు, చర్మవ్యాధి నిపుణుడు సేతురామన్ ఇకలేరు. గురువారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. రాత్రి 8.45 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో హాస్పిట్‌కు తరలించామని, అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సేతురామన్ మృతివార్తతో కోలీవుడ్ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..

స్కిన్ స్పెషలిస్ట్

స్కిన్ స్పెషలిస్ట్

సేతురామన్ వృత్తిరీత్యా చర్మవ్యాధి నిపుణులు. డాక్టర్‌గా సేవలందిస్తూనే నటుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన వయసు 36 సంవత్సరాలు. ఆయనకు భార్య ఉమాయల్, ఏడాది వయసున్న కూతురు ఉన్నారు. సేతురామన్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

2013లో కోలీవుడ్‌లోకి

2013లో కోలీవుడ్‌లోకి

ప్రముఖ నటుడు సంతానంకు సేతురామన్ స్నేహితుడు. 2013లో మణికందన్ దర్శకత్వంలో వచ్చిన కన్న లడ్డు తిన్న అసైయా అనే చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో సంతానం, సేతు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, విశాఖ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత వల్లభ రాజా, సక్కపోడు.. పోడు రాజా, 50/50 చిత్రాల్లో నటించారు.

తమిళ ప్రముఖుల సంతాపం

తమిళ ప్రముఖుల సంతాపం

సేతరామన్ మృతితో తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కుష్బూ, వెంకట్ ప్రభు, నిర్మాత ధనుంజయన్, వివేక్, అతుల్య రవి, లోకేశ్ కనకరాజ్ తదితరులు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.

Recommended Video

RRR Motion Poster Views In Various Languages
ఎప్పుడూ చిరునవ్వుతో..

ఎప్పుడూ చిరునవ్వుతో..

డాక్టర్ సేతురామన్ ఇకలేరనే విషాదవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, డాక్టర్ చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మెరిసే కళ్లతో పెదవిపై చిరునవ్వుతో ఎప్పుడూ కనిపించేవారు. అద్బుతమైన వ్యక్తి. నీవెప్పుడూ మా మనసు, ఆలోచనల్లో ఉంటావు. నీ ఆత్మ శాంతి కలుగాలి. నీ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుతున్నాను అని కుష్బూ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X