పక్కింటి అమ్మాయితో హీరో జంప్.. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఆ మాటలతో ముగ్గులోకి దించి!
తమిళనాడులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తమిళ నటుడిపై కకేసు నమోదైంది. హీరోగా రాణించేందుకు తమిళ నటుడు శివ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే శివ.. పయపులై అనే చిన్న చిత్రంలో హీరోగా నటించాడు. శివ తిరువణ్ణామలై జిల్లా చెంజి అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం శివ రామవరంలోని ఓ అదే ఇంట్లో నివసిస్తున్నాడు. శివ అక్కడ చేసిన ఘనకార్యం ఏంటో వివరాల్లో చూద్దాం!

అవకాశాలు లేకపోవడంతో
పయపులై చిత్రంతో హీరోగా పరిచయమిన శివకు ప్రస్తుతం అవకాశాలు లేవు. రామవరం ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడికి వస్తున్నవి చిన్న పాత్రలు కావడంతో సరైన గుర్తింపు లభించడం లేదు. ఈ నేపథ్యంలో శివకు పక్కింటి అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమెని నెమ్మదిగా మాటలతో మాయచేసి ముగ్గులోకి దించాడు.

అసత్యాలు చెప్పి
చాలా కాలంగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే శివకు ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన భార్యకు విడాకులు ఇచ్చేశానని ఆ యువతికి సత్యాలు చెప్పాడు. అతడి మాటలని ఆ అమ్మాయి పూర్తిగా నెమ్మేసింది. వీరిద్దరి ప్రేమ సంగతి అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. యువతిని ఆమె తల్లిందండ్రులు అతడితో ప్రేమ వద్దని మందలించారు. అయినా ఆమె వినిపించుకోలేదు.

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు
పెళ్లికి ఇంట్లోవాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ యువతి శివతో కలసి పారిపోవడానికి నిర్ణయించుకుంది. ఇటీవల ఇద్దరూ ప్రణాళిక ప్రకారం ఇంట్లో నుంచి పారిపోయారు. దీనితో అమ్మాయి తల్లిదండ్రులు రాయలనగర్ పోలీస్ స్టేషన్ లో శివపై కేసు నమోదు చేశారు. తాజాగా శివ, ఆ యువతి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

పోలిసుల విచారణ
శివ గురించి పోలీసులు ఆరా తీయగా తన భార్యకు అతడు విడాకులు ఇవ్వలేదని తేలింది. ఆ యువతితో కలసి శివ మధురై, కన్యాకుమారి ప్రాంతాల్లో తిరిగొచినట్లు తేలింది. శివకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తన భార్యకు విడాకులు ఇచ్చి తన ప్రియురాలిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని శివ చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications











