Sivakarthikeyan: హీరో శివకార్తీకేయన్‌ కారుకు ప్రమాదం..

తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్ కారుకు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి శివకార్తీకేయన్ క్షేమంగా బయటపడ్డారు. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శివకార్తీకేయన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలియగానే కోలీవుడ్ వర్గాలు షాక్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tamil Actor Sivakarthikeyan Escapes Unhurt in Car Accident

కోలీవుడ్‌లో తదుపరి తరం సూపర్‌స్టార్‌గా దూసుకెళ్తున్నారు శివకార్తీకేయన్. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయనకు కలక్కా పోవతు యారు అనే టీవీ షో కోసం ఆడిషన్స్‌కు రమ్మని ఆహ్వానం అందింది. 2006లో సెకండ్ సీజన్‌లో ఆయన విజేతగా నిలిచారు. ఈ క్రమంలో అయిగన్ సినిమా మేకర్స్ కళ్లలో పడిన శివకార్తీకేయన్‌కు ఈ చిత్రంలో సపోర్టింగ్ రోల్ దక్కింది. అయితే దురదృష్టవశాత్తూ ఆయన నటించిన సన్నివేశాలు ఎడిటింగ్‌లో తొలటగించారు.

అయినప్పటికీ నిరాశ పడకుండా షార్ట్ ఫిలింస్‌తోనూ టెలివిజన్‌పైనా అవకాశాలు అందుకున్నారు. దర్శకుడు పాండిరాజ్.. 2012లో తెరకెక్కించిన మెరీనాలో లీడ్ రోల్ పోషించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ధనుష్ నటించిన 3 మూవీలో హీరో ఫ్రెండ్‌గా నటించాడు. అనంతరం మనం కోతి పరవాయై, కేడి బిల్లా కేడీ కిలాడీ రంగ, ఎథిర్ నిశ్చల్, రజనీ మురుగన్, రెమో, వెలైక్కరన్, సీమరాజా, మిస్టర్ లోకల్, కౌశల్య కృష్ణమూర్తి, హీరో, డాక్టర్, ప్రిన్స్, అయలాన్ తదితర చిత్రాలతో యువతలో క్రేజ్ దక్కించుకున్నారు.

లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా ఉన్న శివకార్తీకేయన్ కెరీర్‌ను అమరన్ చిత్రం మలుపు తిప్పింది. ఇందులో మిలటరీ ఆఫీసర్‌గా ఆయన నటన, యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. క్లైమాక్స్‌లో శివకార్తీకేయన్ నటన కంటతడి పెట్టించింది. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లతో ఆయన సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమరన్ తర్వాత శివకార్తీకేయన్‌కు తమిళనాట సూపర్‌స్టార్ స్టేటస్ వచ్చింది.

సూపర్‌స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్, అజిత్‌ల తర్వాత ఆయనకు కూడా కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమకు తదుపరి దళపతిగా శివకార్తీకేయన్‌‌ నిలుస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరగగా దానిని శివకార్తీకేయన్ ఖండించారు. అన్న ఎప్పటికీ అన్నే.. తమ్ముడు ఎప్పటికీ తమ్ముడేనంటూ విజయ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం పరాశక్తి మూవీలో శివకార్తీకేయన్ నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల, రవిమోహన్, అథర్వ, రానా దగ్గుబాటి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పరాశక్తి చిత్రం శివకార్తీకేయన్ కెరీర్‌లో 25వ సినిమా కావడం విశేషం. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీలకు కూడా తమిళంలో ఇదే తొలి చిత్రం. సంక్రాంతి కానుకగా జనవరి 14న పరాశక్తి ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, నటీనటుల ఫస్ట్‌లుక్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో పరాశక్తిపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X