మృత్యువుతో పోరాడుతూ ప్రముఖ నటుడుకన్నుమూత.. శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ
దాదాపు 30 ఏళ్లుగా తమిళ సినీ రంగానికి సేవలందించిన నటుడు థవాసీ ఇక లేరు. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ నవంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం బయటకు వచ్చాక తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ లాంటి వాళ్లు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. అయితే థవాసీని బతికించుకోవాలన్న ప్రయత్నాలు విఫలం కావడంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదంలో మునిగిపోయింది. థవాసీ గురించి మరిన్ని విషయాలు.

అన్నవాహిక క్యాన్సర్‌తో
అన్నవాహికలో క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌కి వెళ్లడంతో నవంబర్ 11వ తేదీన మధురైలోని ప్రముఖ శరవణన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈసోఫాజియల్ స్టెంట్‌తో ప్రత్యేకంగా పద్ధతుల్లో చికిత్సను అందించారు. రెండు రోజులుగా శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తాయి. దాంతో ఐసీయూలోకి షిఫ్టు చేశాం. కానీ సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కన్నుమూశారు అని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

ఇలాంటి వ్యాధి వెంటాడుతుందని..
మరణానికి కొద్ది రోజుల ముందు ఆర్థికపరమైన సమస్యల్లో థవాసీ కూరుకుపోయారు. తన బాధలను చెప్పుకొంటూ ఓ వీడియోను రిలీజ్ చేయగా.. అందర్నీ భావోద్వేగానికి గురిచేసింది. గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. కానీ ఇలాంటి దారుణమైన వ్యాధి నన్ను ఇలా బాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు అని థవాసీ తన వీడియోలో పేర్కొన్నారు.

దేవుడు పెట్టిన పరీక్ష ఇది..
నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. ఇది దేవుడు నాకు పెట్టిన అగ్ని పరీక్షగా భావిస్తున్నాను. ఈ సవాల్‌ను మనోస్థైర్యంతో ఎదుర్కొంటున్నా. నా చికిత్సకు ఎవరైనా ఆర్థిక సహాయం అందించండి అంటూ థవాసీ వేడుకొన్నారు.
Recommended Video

హాస్యాన్ని పంచిన నటుడికి ఇంత విషాదమా?
మృత్యువుతో పోరాడుతూ ఉన్న థవాసీని ఇటీవల ఓ నటుడు కలిసి పరామర్శించారు. ఆయన దుర్భర పరిస్థితిని చూసి భావోద్వేగానిక గురయ్యాడు. తన ప్రతిభతో ఎందరికో హాస్యాన్ని పంచిన నటుడు దారుణ పరిస్థితుల్లో ఉండటం చూసి తాను విషాదానికి గురయ్యాను అని చెప్పారు. కిజక్కు చీమియిల్లే లాంటి గొప్ప చిత్రాల్లో నటించిన థవాసీకి రజనీకాంత్ నటించిన అన్నాతే చివరి చిత్రం. ఇటీవల శివకార్తికేయన్ చిత్రాల్లో నటించి మెప్పించారు.


Click it and Unblock the Notifications











