అక్షయ్ కుమార్ సరసన త్రిష
బాలీవుడ్ దర్శకుడు ప్రియదర్సన్ నిర్మించే హిందీ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించేందుకు దక్షిణాది తార త్రిష ఎంపికైంది. కట్టా మీఠా సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు కొత్త ముఖం కావాలని అక్షయ్ కోరుకున్నాడని, తాను త్రిష పేరు సూచించానని ప్రియదర్సన్ చెప్పారు. అక్షయ్ త్రిష సినిమాలు కొన్ని చూసి సంతృప్తి చెందాడని, దాంతో త్రిష ఈ సినిమాకు ఎంపికైందని ఆయన వివరించారు.
హిందీ సినిమాలో నటించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందని త్రిష అంటోంది. తన లక్కీ దర్శకుడు ప్రియదర్శన్ అని, తనను తమిళ సినిమాకు పరిచయం చేసింది ఆయనే అని, ఇప్పుడు హిందీ సినిమాలకు పరిచయం చేస్తున్నారని ఆమె అంటోంది.దక్షిణాదిలో తాను నిలదొక్కుకున్నానని, బాలీవుడ్ లో కూడా తాను నిలబడగలననే నమ్మకం ఉందని ఆమె అన్నది. త్రిష హీరోయిన్ గా నటించే ఈ హిందీ సినిమా షూటింగ్ అక్టోబర్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
trisha akshay kumar bollywood tamil actor priyadarshan katta meeta బాలీవుడ్ ప్రియదర్సన్ అక్షయ్ కుమార్ త్రిష కట్టా మీఠా


Click it and Unblock the Notifications