twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాళాలు బద్దలు కొట్టే ప్రయత్నం చేసిన హీరో విశాల్ అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం!

    |

    Recommended Video

    తాళాలు బద్దలు కొట్టే ప్రయత్నం చేసిన హీరో విశాల్ అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం!

    తమిళ స్టార్ విశాల్ గురువారం ఉదయం అరెస్ట్ అయ్యాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న విశాల్... కౌన్సిల్ కార్యాలయానికి వేసిన తాళాలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశాల్, పోలీసుల మధ్య తీవ్రవాగ్వివాదం చోటు చేసుకుంది.

    ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న విశాల్ మీద నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెళ్లువెత్తాయి. దీంతో కొందరు నిర్మాతలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీరాజా నేతృత్వంలోని ఓ వర్గం కౌన్సిల్ కార్యాలయానికి బుధవారం తాళం వేశారు.

    ముఖ్యమంత్రి వద్దకు వివాదం

    ముఖ్యమంత్రి వద్దకు వివాదం

    గురువారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసిన భారతీరాజా నేతృత్వంలోని బృందం ప్రొడ్యూసర్ కౌన్సిల్ వివాదంలో ప్రభుత్వం కల్పించుకుని పరిష్కరించాలని విన్నవించారు. ఈ పరిణామాలు విశాల్‌కు గడ్డుకాలమే అంటున్నారు. విశాల్ కొన్నిరోజులుగా తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న సంగతి తెలిసిందే.

    విశాల్ మీద కంప్లయింట్

    విశాల్ మీద కంప్లయింట్

    ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే విశాల్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో వైపు విశాల్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు కంప్లయింట్ నమోదైంది. ఈ గొడవ నేపథ్యంలో టినగర్లోని ప్రొడ్యూసర్స్ కౌన్సికల్ కార్యాలయం వద్ద గట్టి బద్రత ఏర్పాటు చేశారు.

    పోలీసుల తీరుపై మండిపడ్డ విశాల్

    బుధవారంఅనధికార వ్యక్తులు కౌన్సిల్ కార్యాలయానికి తాళం వేస్తే మౌనంగా ఉన్న పోలీసులు... కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న నేను, నా కొలీగ్స్ ఈ రోజు లోనికి వెళుతుంటే అరెస్ట్ చేశారు. పోలీసులు ఇలా చేస్తారని ఊహించలేదు. ఈ విషయంలో మేము పోరాటం చేస్తాం. ఇళయరాజా కాన్సెర్ట్ నిర్వహించి తీరుతాం, నిధుల సమీకరణ జరుపుతాం... అని విశాల్ ట్వీట్ చేశారు.

    విశాల్ పదవి నుంచి దిగిపోవాలి

    విశాల్ పదవి నుంచి దిగిపోవాలి

    విశాల్, అతడి వర్గం మీద... వ్యతిరేక వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో దాదాపు రూ. 8 కోట్ల వరకు నిధులు దుర్వినయోగం అయినట్లు వారు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ విశాల్ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని దీనిపై విచారణ జరిపించే అవకాశం ఉంది.

    విశాల్‌కు వెన్నుపోటు

    విశాల్‌కు వెన్నుపోటు

    2017లో హీరో విశాల్ తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశాల్ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన విధులు నిర్వహిస్తున్నాడు. అయినా కూడా కొందరు నిర్మాతల్లో విశాల్ పట్ల అసంతృప్తి ఉంది. తరచుగా ఎవరో ఒకరు విశాల్ అధ్యక్షుడిగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. విశాల్ పక్కనే ఉంటూ అతడికి వెన్నుదన్నుగా ఉన్న కొందరు నిర్మాతలు ఇపుడు వెన్నుపోటు పొడిచినట్లు వార్తలు తెరపైకి వచ్చాయి.

    English summary
    Tamil Actor Vishal arrested. Several Tamil producers locked the offices of Tamil Nadu Producer’s Council yesterday accusing Vishal for misusing the funds. Vishal who tried broke opening the doors has been taken into custody.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X