బికినీ వేసుకోమని అడిగారు.. ముఖం మీదే చెప్పేశా.. అమలాపాల్ షాకింగ్ కామెంట్స్!
Recommended Video

అందం, అభినయంతో ప్రేక్షుకులని కట్టిపడేయగల సుందరి అమలాపాల్. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. అమలాపాల్ సినీజీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా వివాదాలు చెలరేగాయి. కానీ వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటూ సినిమాల్లో నటిస్తోంది. తాజగా తనకు వచ్చిన కొన్ని బాలీవుడ్ అవకాశాలపై అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తమిళ్ లో బిజీగా
తమిళ సినిమాలతో బిజీగా గడుపుతున్న అమలాపాల్ కు బాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. గత ఏడాది తిరుట్టు పాయాలే 2 చిత్రంలో నటించిన అమల ఈ ఏడాది భాస్కర్ ఓరు రాస్కల్ అనే చిత్రంలో నటించింది.

బాలీవుడ్ ఎంట్రీ
ఇటీవలే అమలాపాల్ బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అమలాపాల్ కు బాలీవుడ్ లో ఇది డెబ్యూ మూవీ. అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో హీరో. నరేష్ మల్హోత్రా దర్శకుడు.

బికినీ వేసుకోవాలని
గతంలో కూడా తనకు బాలీవుడ్ అవకాశాలు వచ్చినట్లు అమలాపాల్ తెలిపింది. బికినీ వేసుకోవాలని అడిగారు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ చెత్త సన్నివేశాలలో బికినీ వేసుకోమని సూచించడంతో ఆ సినిమాలు చేయనని ముఖం మీదే చెప్పేశా అని అమలాపాల్ తెలిపింది.

ఆడిషన్ లేకుండానే
నరేష్ మల్హోత్రా తన చిత్రాలని చూశారు. నేనే ఈ సినిమాకు సరిపోతానని ఎలాంటి ఆడిషన్ లేకుండా ఎంపిక చేసుకున్నారు అని అమలాపాల్ తెలిపింది. ఈ చిత్రం త్వరలో హిమాలయాల్లో షూటింగ్ జరుపుకోబోతోంది.


Click it and Unblock the Notifications











