నాపై బ్యాన్ పెడతారా మీ ఇష్టం...అసిన్
కష్టాల్లో ఉన్న తమిళులకు సాయం చేయడం తప్పా? నేను నటీనటుల సంఘం చెప్పే నిబంధనలను తప్పకుండా అనుసరిస్తాను. ఇది వరకు అతిక్రమించలేదు. నిషేధం విధిస్తే తప్పకుండా వారి ఆజ్ఞలను పాటిస్తాను. నటన అనేది రాజకీయాలకు అతీతమైనది. అందులో రాజకీయాలు చొప్పించకూడదు. అక్కడి తమిళులకు నిర్వహించే వైద్య శిబిరం తొలివిడత పనులు పూర్తయ్యాయి అని అసిన్ మీడియాతో రీసెంట్ గా అంది. అలాగే నటీనటుల సంఘం నిబంధనలకు కట్టుబడి ఉంటానని, క్షమాపణ చెప్పేంత తప్పు తానేమీ చేయలేదని నటి అసిన్ పేర్కొన్నారు. శ్రీలంకలో ఓ హిందీ చిత్రం చిత్రీకరణలో పాల్గొన్నందుకు అసిన్ క్షమాపణ చెప్పాలని నటీనటుల సంఘం కార్యదర్శి రాధారవి కోరారు. దీనిపై ఓ తమిళపత్రికతో నటి అసిన్ మాట్లాడుతూ..క్షమాపణ చెప్పాలని అంటున్నారు. నేను ఆ స్థాయిలో తప్పేమీ చేయలేదు. అసిన్..సల్మాన్ ఖాన్ తో కలిసి తెలుగు లో హిట్టయిన రెడీ చిత్రం రీమేక్ లో చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె షూటింగ్ యూనిట్ తో కలిసి శ్రీలంక వెళ్ళింది.


Click it and Unblock the Notifications











