యువ హీరోయిన్, బీజేపీ నేత అరెస్ట్.. పోలీసుల అదుపులో అందాల తార!
తమిళ నటి, భారతీయ జనతా పార్టీ నేత జయలక్ష్మి అరెస్ట్ అయ్యారు. చీటింగ్, డాక్యుమెంట్ల ఫోర్జరీ వ్యవహారంలో ఆమెను తిరుమంగళం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఎగ్మోర్ కోర్టు ఆదేశాల మేరకు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్ట్‌కు ముందు నడిచిన డ్రామా, అరెస్ట్ తర్వాత ఆమె చేసిన ప్రకటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సినీ నటి జయలక్ష్మీపై సినీ గేయ రచయిత స్నేహన్ కేసు నమోదు చేశాడు. స్నేహన్ ఫౌండేషన్ నిధులను అక్రమంగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పోలీసులకు, కోర్టుకు ఫిర్యాదు చేశారు. తాను నిధులు దుర్వినియోగం వ్యవహారంలో ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ఆమెకు పలుమార్లు లేఖలు రాశాను. కానీ స్పందించలేదు. అందుకే కేసు నమోదు చేశానని ఆయన వివరణ ఇచ్చారు.

అయితే తాను నిధుల వ్యవహారంపై జయలక్ష్మీకి ఫోన్ చేశాను. అయితే వ్యక్తిగతంగా కలుసుకొందామని చెప్పి.. ఆఫీస్‌కు రమ్మన్నారు. వెబ్‌సైట్ ఆధారంగా ఆ ఆఫీస్‌కు వెళితే..అక్కడ స్నేహన్ ఫౌండేషన్ ఆఫీస్ లేదన్నారు. దాంతో జయలక్ష్మీ, స్నేహన్ మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో స్నేహన్‌పై కూడా ఆమె కేసు నమోదు చేశారు. దాంతో ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారం జయలక్ష్మి అరెస్ట్ వరకు వెళ్లింది.
అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు జయలక్ష్మీని అరెస్ట్ చేయడానికి వెళ్లగా.. ఆమె అందుకు నిరాకరించారు. తాను పోలీస్ వ్యాన్‌లో రాను. నా సొంత వెహికిల్‌లో వస్తానని చెప్పి కారులో ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకొన్నారు. దాంతో ఆమె అరెస్ట్‌ను పోలీసులు చూపించారు.

అయితే తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు చేసిన కుట్ర అని జయలక్ష్మీ ప్రతీ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో క్లారిటీ కోసం తనను ఏనాడు సంప్రదించలేదు. నాతో ఎలాంటి చర్చలు జరుపలేదు. నిధుల దుర్వినియోగం జరుగలేదు. నాపై అవాస్తవాలతో విమర్శలు చేస్తున్నారు అని జయలక్ష్మి ఆరోపణలు చేసింది.
సినీ నటి జయలక్ష్మీ విషయానికి వస్తే.. బీజేపీ ప్రచార కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమె చెన్నైలోని 90వ వార్డు నుంచి పోటీ చేశారు. తాజా అరెస్ట్ రాజకీయ, సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. ఈ అరెస్ట్ తర్వాత ఈ కేసు వ్యవహారం ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











