సీనియర్ జర్నలిస్టు లైంగికంగా వేధిస్తున్నాడు: తమిళ నటి ఫిర్యాదు

తమిళ నటి గాయిత్రి సాయి(42) సీనియర్ జర్నలిస్టు మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయింది. తనకు లొంగకుంటే నిన్ను అప్రతిష్టపాలు చేస్తానంటూ జర్నలిస్ట్ ప్రకాష్ ఎం స్వామి తనను వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా పేజీలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియో కూడా ఆమె పోస్టు చేశారు.

గత రెండేళ్లుగా ఇతడు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, పోలీస్ కమీషనర్‌ను కలిసి తాను ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వాట్సాఫ్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని, తన కుమారుడిని పాస్‌పోర్ట్ విషయంలో హెల్ప్ చేస్తాననే నెపంతో మా ఇంటికి వచ్చి ఫిజికల్‍‌గా వేధించేవాడని సదరు నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tamil Actress sexual allegation on journalist

2016లో హాంకాంగ్‌లో తన భర్త హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన తర్వాత తొలిసారి స్వామి తనను కలిశాడని నటి పేర్కొంది. నా భర్తను నేనే చంపినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాడని, కొన్ని లోకల్ మేగజైన్లో చీప్, బేస్ లెస్ స్టోరీస్ కూడా తనపై రాశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తననే కాకుండా తన కూతురును కూడా డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని నటి గాయిత్రి సాయి ఆరోపించారు. చాలా మంది మహిళలను అతడు వేధించాడని, తనకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి బెదిరింపులకు పాల్పడుతుంటాడని ఆరోపించారు.

అయితే తనపై చేస్తున్న ఆరోపణలను జర్నలిస్ట్ స్వామి ఖండించారు. నేను ఆమె ఇంటిని ఎప్పుడూ సందర్శించలేదని, సెక్సువల్ వేధింపులకు పాల్పడ్డట్లు ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రెండేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నట్లు చెబుతున్న ఆమె... ఇంతకాలం ఎందుకు ఆగిందని ప్రశ్నించారు. పాస్ పోర్ట్ విషయంలో హెల్ప్ చేసిన మాట నిజమే అన్నారు. ఆమెకు వ్యతిరేకంగా తాను ఓ స్టోరీని సిద్దం చేస్తున్నానని, అది తెలిసి నాపై ఇలాంటి లేని పోని ఆరోపణలు చేస్తోందిన జర్నలిస్టు స్వామి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X