twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోని పెళ్లి చేసువాలనుంది.. బిగ్‌బాస్ భామపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

    |

    బిగ్ బాస్ తో పాలుపర్ అయిన సెలెబ్రిటీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. బిగ్ బాస్ షో చాలా మంది సెలెబ్రిటీలకు, నటీనటులకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో నటి, మోడల్ అయిన యషిక ఆనంద్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా యషిక పాపులారిటీ మరింతగా పెరిగింది. కానీ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ నెటిజన్ల ట్రోలింగ్ కు బలవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో యషిక చేసిన ఓ కామెంట్ ఆమెకు చిక్కులు తీసుకుని వచ్చింది.

    అందాలు ఆరబోస్తూ

    అందాలు ఆరబోస్తూ

    యషికకు సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. యువతకు మత్తెక్కించే హాట్ ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ దూసుకుపోతోంది. 2016లో సినీరంగ ప్రవేశం చేసిన యషిక పలు తమిళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. విజయ్ దేవరకొండ నోటా చిత్రంలో కూడా తళుక్కున మెరిసింది. గత ఏడాది బిగ్ బాస్ 2 తో అందరి దృష్టిని ఆకర్షించింది.

     సూర్యని పెళ్లి చేసుకోవాలని

    సూర్యని పెళ్లి చేసుకోవాలని

    ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో ఓ ప్రశ్న ఎదురైంది. ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా.. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. తనకు హీరో సూర్యని పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికని బయట పెట్టింది. కావాలని ఇలా మాట్లాడిందో లేక సరదాగా కామెంట్ చేసిందో తెలియదు కానీ సూర్య అభిమానులు మాత్రం రెచ్చిపోయారు.

     ఇద్దరు పిల్లల తండ్రి

    ఇద్దరు పిల్లల తండ్రి

    హీరో సూర్యకు ఆల్రెడీ పెళ్లయింది. అతడు ఇద్దరు పిల్లల తండ్రి. పెళ్ళైన వ్యక్తి గురించి ఇలా మాట్లాడకూడదని కనీస జ్ఞానం లేదా అంటూ నెటిజన్లు యషికపై విరుచుకుపడ్డారు. విమర్శలు ఎక్కువవుతుండడంతో యషిక తన కామెంట్ ని డిలీట్ చేసింది. ఇలా సోషల్ మీడియాలో యాషిక ఎదో ఒక తప్పు చేస్తూ ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. ఇది యషికకు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.

    పార్కులో అభిమానులతో

    పార్కులో అభిమానులతో

    గతంలో యషిక ఓ పార్కుని సందర్శించిన సందర్భంగా అభిమానులు ఎగబడ్డారు. యషికని ఆటోగ్రాఫ్స్ ఇవ్వాలని కోరారు. కొందరు అభిమానులైతే తమ వద్ద ఉన్న కరెన్సీ నోట్స్ తీసి ఆటోగ్రాఫ్ అడిగారు. యషిక వాటిపై సంతకం చేసింది. ఈ విషయంలో కూడా యషిక ట్రోలింగ్ కు గురైంది. కరెన్సీ నోట్లపై సంతకం చేయడానికి నీవేమైనా ఆర్బీఐ గవర్నర్ అనుకుంటున్నావా అంటూ విమర్శించారు. కరెన్సీ నోట్లపై రాతలు రాయడం సరైంది కాదు అంటూ చురకలు అంటించారు.

    English summary
    Tamil actress Yashika Aannand says she would like to get married to Surya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X