Dasara: హీరో నానితో యాంకర్ పోటీ.. చివరికీ అది తాగలేక కక్కెసి.. వీడియో వైరల్
అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని అనుకోకుండా హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే నటనపరంగా పక్కింటి కుర్రాడి వంటి పాత్రలతో నేచురల్ స్టార్ అయ్యాడు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.
ఇప్పుడు తాజాగా దసరా అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు అంతే రేంజ్ లో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు నాని. ఈ క్రమంలోనే ఆయనతో ఓ యాంకర్ మందు బాటిల్ ఎత్తే ఛాలెంజ్ పెట్టుకుని ఏం చేసిందో చూసేయండి.

వెన్నెలగా కీర్తి సురేష్..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా అంటే సుందరానికి సినిమాతో అలరించగా త్వరలో దసరా సినిమాతో రానున్నాడు. 90వ దశకం కాలంలో బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నాని మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకోసం చాలా సమయం పట్టేదని ఇటీవల నాని చెప్పిన విషయం తెలిసిందే. నానితోపాటు హీరోయిన్ గా చేసిన కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లో వెన్నెల పాత్రలో ఆకట్టుకోనుంది.

నాని కెరీర్ లోనే..
న్యూ టాలెంటెడ్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమాను నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకొవచ్చు.

పాన్ ఇండియాగా ప్రమోషన్స్..
ఇక నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన దసరా సినిమాను పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. తెలంగాణలోని ఓ గ్రామం వీరపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని సింగరేణి లోకల్ రైళ్లలో బొగ్గును దొంగలించే యువకుడిగా కనిపించనున్నాడు. మార్చి 30 గ్రాండ్ గా విడుదల చేయనున్న ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ బాగా నిర్వస్తున్నాడు నాని. ఇటీవల చెన్నైకి వెళ్లిన నాని అక్కడి మీడియాకు, యూట్యూబ్ ఛానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

నాని ఓకే అనడంతో..
లిటిల్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ కు నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో దసరా సినిమాలో ఎత్తిన మందు బాటిల్ దించకుండా, చేతితో పట్టుకోకుండా, నోటితోనే పట్టుకుని తాగే సీన్ ప్రస్తావన వచ్చింది. మీకు ఇష్టమైతే ఇక్కడ ఆ ఛాలెంజ్ ను ట్రై చేద్దామా అని ఆ యాంకర్ నానిని అడిగింది. దానికి నాని ఓకే చెప్పడంతో.. రెండు చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ తెప్పించారు. నానికి ఒకటి ఇచ్చి ఆ యాంకర్ ఒకటి తీసుకుంది.
నవ్వులపాలైన యాంకర్..
అయితే ఆ కూల్ డ్రింక్ బాటిల్ ను ఎలా నోట్లో పెట్టుకోవాలో ఆ తర్వాత దాన్ని ఎలా తాగాలో యాంకర్ కు నాని వివరించాడు. నానికి సినిమా చిత్రీకరణలో భాగంగా అలవాటు కావడంతో గడగడ తాగేశాడు. కానీ యాంకర్ మాత్రం నోటితో బాటిల్ పైకెత్తలేక చేత్తో కిందకు తీసేసింది. ఆమె నోట్లో ఉన్న డ్రింక్ ను నురగతోపాటు అమాంత కక్కేసింది. ఇలా నానికి ఛాలెంజ్ విసిరి చివరిగా ఆ యాంకరే నవ్వులపాలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోపై పలు క్లిప్స్ యాడ్ చేసి మీమ్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











