తెలుగులో భారీ హిట్ అయిన "అరుంధతి" సినిమా తమిళంలో కూడా పెద్ద హిట్ అయ్యే అవకాశాలున్నట్టు వార్తలు, రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా తమిళ వెర్షన్ నిన్న విడుదలైంది. డబ్బింగ్ హక్కుల కోసం తమిళ నిర్మాతలు కోట్లాడి రూపాయలు ఆఫర్ చేసినా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్వయంగా తానే తమిళంలో కూడా డబ్ చేసుకుని విడుదల చేసుకున్నారు. చిరంజీవితో "అంజి" సినిమా తీసి ఆరిపోయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అరుంధతి కనక వర్షం కురిపిస్తోంది. ఒకే బాటలో పట్టుదలగా సాగిపోయేవారికి విజయాలు లభిస్తాయన్న సత్యం శ్యామ్ ప్రసాద్ రెడ్డి విషయంలో నిజమైంది.