తమిళ 'అరుంధతి' రిజల్ట్
తెలుగులో సంచలన విజయం సాధించిన అరుంధతి చిత్రం తమిళనాట తిరగబడింది. శ్యామ్ ప్రసాధ్ రెడ్డే స్వయంగా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన ఈ చిత్రం అక్కడ వారికి నచ్చటం లేదు. నిజానికి ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ కోసం చాలా పోటీ వచ్చింది. కానీ శ్యామ్ వారు చెప్పే రేటు నచ్చక స్వయంగా రిలీజ్ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రం గురించి అక్కడ ఓ మాదిరి రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు మాత్రం ఓ డబ్బింగ్ చిత్రం అన్నట్లు ఫీలయ్యారు.
మనకిక్కడ ఫ్లస్ అయిన రవిశంకర్ వాయిస్(సోనూ సూద్) అక్కడ మైనస్ అయిందని తెలుస్తోంది. అలాగే అక్కడ మాధవన్ రెండు చిత్రం ద్వారా పరిచయమైన అనూష్క ఇప్పుడిప్పుడే వారికి పూర్తి స్ధాయిలో పరిచయమవుతోంది. దాంతో వారికి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర చేసేంత స్క్రీన్ వయస్సు (తమిళం) రాలేదంటూ కొన్ని విమర్శిస్తూ రాసాయి. ఏదైమైనా ఇంకా హిందీ అరుందతి కూడా తీస్తానంటున్నారు కాబట్టి..అదేమవుతుందో చూద్దాం.


Click it and Unblock the Notifications











