కన్ను మూసిన కెమెరా: "ప్రియన్" మృతి కి సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి
ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్ ప్రియన్ కన్నుమూశారు. నవంబర్-9 మధ్యాహ్నం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్ ప్రియన్ కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన సినీ కెరీర్‌లో ఎక్కువగా దర్శకుడు హరి తెరకెక్కించిన సినిమాలకు ఛాయాగ్రహణం అందించారు. ముఖ్యంగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన 'సింగమ్' సిరీస్ సినిమాలకు ప్రియన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

సినిమాటోగ్రాఫర్ ప్రియన్
సూర్య నటించిన సింగం మూవీ.. ఈ మూవీకి వచ్చిన రెండు సీక్వెల్స్ కూడా తమిళ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అంతేకాదు తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఈ సినిమాలు అంత సక్సెస్ సాధించడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన సినిమాటోగ్రాఫర్ ప్రియన్ కన్నుమూశారు.

హార్ట్ అటాక్
నిన్న మధ్యాహ్నం ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్‌కు తరలించగా.. ఆయన కన్నుమూసినట్టు డాక్టర్లు నిర్ధరించారు.పరిశ్రమలో సీనియర్ సినిమాటోగ్రాఫర్ అయిన ప్రియన్ ప్రస్తుతం సౌతిండియా సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్‌కి ఉపాధ్యక్షుడిగానూ సేవలు అందిస్తున్నారు.

ప్రియన్ లేని లోటు తీర్చలేనిది
ప్రియన్ మృతి వార్త తెలుసుకున్న తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సినిమాటోగ్రఫీలో సిద్ధహస్తుడైన ప్రియన్ లేని లోటు తీర్చలేనిది అని పలువురు సినీ ప్రముఖులు.. ఆయన మృతిపట్ల తమ సంతాపం ప్రకటించారు.

సామి స్క్వేర్
ప్రస్తుతం విక్రమ్-హరి దర్శకత్వంలో ‘సామి స్క్వేర్ మూవీకి పనిచేస్తున్నారు. 2003లో వచ్చిన సామి సినిమాకి సీక్వెల్ ఇది. హరితో కలిసి 13 సినిమాలకు పనిచేశారు ప్రియన్. తమిళనాడు విరుదున్‌గర్‌లోని నాగేంద్రన్‌లో జన్మించిన ప్రియన్.. నటుడు, నిర్మాత కె.బాలాజీ యూనిట్‌లో అసిస్టెంట్ కెమేరామెన్‌గా పనిచేశారు.

చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి
కె.ఎస్.అధియామన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘తోటచిన్గుని' సినిమాకి తొలిసారి కెమేరామెన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ‘తెనాలి', ‘వల్లవన్', ‘వేలాయుధం', ‘పూజ' తదితర ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఛాయాగ్రహణం అందించారు. ప్రియన్ మృతితో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











