ప్రముఖ కమెడియన్ నీలకంఠన్ ఇక లేరు
ప్రముఖ తమిళ కమెడియన్, స్టేజ్ యాక్టర్ నీలకంఠం ఇక లేరు. తమిళ సినీ పరిశ్రమలో నీలుగా పాపులర్ అయిన గురువారం సాయంత్రం మరణించారు. ఆయన దాదాపు 150కిపైగా తమిళ సినిమాలు, 7వేలకు పైగా నాటకాల్లో నటించారు.
నీలు 1969లో 'ఆయిరామ్ పోయ్' అనే సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించారు. అవ్వాయి షన్ముగి, సూర్యవంశం, కతాలా కాతాలా, ధీనా, పమ్మల్ కె సమ్మందన్, కళ్యాణ సమయల్ సాధమ్, త్రిషా ఇల్లేనా నయనతార తదితర చిత్రాల్లో నటించారు.

82 ఏళ్ల నీలు కొంతకాలంగా వయసు సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నీలకంఠన్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు, ఆయన మరణం తీరనిలోటు అన్నారు.


Click it and Unblock the Notifications











