ప్రముఖ హాస్య నటుడు వివేక్ కుటుంబంలో విషాదం
ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వివేక్ తల్లి బుధవారం అనారోగ్యంతో మరణించారు. వయసు సంబంధమైన అనారోగ్యంతో కొంతకాలంగా బాధ పడుతున్న ఆమె చెన్నైలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వివేక్ కుటుంబంలో... తరచూ విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వివేక్ 13 ఏళ్ల కుమారుడు మరణించిన సంగతి తెలిసిందే. ఇపుడు తల్లి మరణంతో ఆయన మరింత కృంగిపోయారు.

వివేక్ గురించిన వివరాల్లోకి వెళితే... 1987లో వనతిల్ వృద్ది వేండుమ్ సినిమాతో తెరంగ్రేటం చేసిన వివేక్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ఇప్పటి వరకు దాదాపు 250 చిత్రాల్లో నటించారు. సౌతిండియాలోని ప్రముఖ కమెడియన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
పలువురు తమిళ స్టార్ హీరోల సినిమాలు తెలుగులోనూ అనువాదం అయి విడుదలైన నేపథ్యంలో వివేక్ టాలీవుడ్ ప్రేక్షకలకు సుపరిచితమే. శివాజీ, అపరిచితుడు, రఘువరణ్ బిటెక్, రోబో చిత్రాల్లో వివేక్ నటించాడు. ప్రస్తుతం విజయ్ మూవీ బిగిల్‌లో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











