twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్ లో ప్రమాదం.. 'నా ఆటోగ్రాఫ్' దర్శకుడికి తీవ్ర గాయాలు

    |

    సినిమా షూటింగ్స్ లో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు కూడా కలుగవచ్చు. గతంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో కూడా ఒక పెద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సహాయ దర్శకులతో పాటు ఒక వ్యక్తి మరణించాడు. అప్పటి నుంచి చాలావరకు సినిమా షూటింగ్ లో నిర్మాతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో దర్శకులు ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని డైరెక్ట్ చేస్తున్నారు. వీలైనంత వరకు రిస్క్ లేకుండానే యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇటీవల ఒక తమిళ దర్శకుడు అయితే ఒక సాధారణ సన్నివేశంలో లో నటిస్తుండగా బిల్డింగ్ పై నుంచి కిందకి పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో హృదయానికి హత్తుకునే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన చేరణ్. తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాను మొదట తమిళ్ లోనే తెరకెక్కించింది ఈ దర్శకుడు. డైరెక్షన్ చేయడమే కాకుండా ఆ సినిమాలో చేరణ్ హీరోగా కూడా నటించాడు. అక్కడ విడుదల అయిన తర్వాతనే తెలుగులో రవితేజ హీరోగా ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ గా తెరకెక్కించారు. అయితే తమిళంలో సక్సెస్ అయినంతగా తెలుగులో మాత్రం సక్సెల్ కాలేకపోయింది. కానీ కొన్నిసార్లు ఆ సినిమా టీవీలో వస్తే మాత్రం మంచి రేటింగ్ అందుకుంటోంది.

    Tamil director and actor Cheran injured in film shoot

    ఇక చేరన్ కు ప్రమాదం జరిగిన విషయంలోకి వెళ్తే.. నంద పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ 'ఆనందం విలయటం వీడు' షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగిందట. తమిళనాడులోని దిండిగల్‌లో గత కొన్ని రోజులుగా నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. అయితే వరుసగా మూడు రోజులు కూడా సాఫీగానే కొనసాగిన ఈ సినిమా షూటింగ్ లో నాలుగవ రోజు మాత్రం ఊహించని ఘటనతో అందరికి షాక్ ఎదురైంది.గౌతమ్ కార్తీక్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా చేరన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

    అయితే ఒక సీన్ కోసం కడుతున్న ఇంటి పైన చేరన్ ఉండాల్సి వస్తుంది. పనివాళ్ళతో మాట్లాడుకుంటూ కాస్త ఆవేశంలో డైలాగ్స్ చెప్పాలని దర్శకుడు చెప్పాడట. ఇక దర్శకుడడు చెప్పినట్లుగానే చేసిన చేరన్ అనుకోకుండా ఒక కాలును వెనక్కి వేయడంతో జారిపోయి కిందపడిపోయాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడినట్లు తెలుస్తోంది. చేరన్ కు తీవ్ర గాయాలు కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. తొందరగానే తీసుకు రావడం వలన వైద్యులు కూడా వెంటనే స్పందించి చికిత్స చేశారు. 8 కుట్లు పడినప్పటికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని పెద్ద గండం నుంచి బయటపడినట్లు వైద్యులు అందరికి భరోసా ఇచ్చారు. ఇక వెంటనే కోలుకున్న చేరన్ మళ్ళీ షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.

    English summary
    Kollywood actor and director Cheran suffered a head injury while shooting for a film in tamilnadu on Thursday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X