ఇక రాధిక కూతురు కూడా త్వరలోనే...
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన రాధిక తన కుమార్తెను హీరోయిన్ గా తెరకు పరిచయం చేయటానికి సన్నాహాలు చేస్తోంది. అందుకోసం ఎడతెరిపి లేకుండా కథలు వింటోంది. అలాగే రాధిక భర్త హీరో శరత్ కుమార్ కూడా తన కూతురు తెరంగ్రేటం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని దర్శకులతో మంతనాలు సాగిస్తున్నారు. ఇక ఈ అమ్మాయిని వెండితెరకు పరిచయం చేసేది మరెవరో కాదు స్టార్ డైరక్టర్ బాల. 'శివపుత్రుడు' నుంచి 'నేను దేవుడ్ని' దాకా ఆయన ప్రతీ చిత్రం వైవిద్యంతో కూడుకున్నదే. గ్లామర్ హీరోయిన్ గా కన్నా నటనతో నెగ్గుకొచ్చే హీరోయిన్ అయితే తన కూతురు కెరీర్ కి ఎక్కువ కాలం స్పాన్ ఉంటుందని భావించి రాధిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అందులోనూ మరో ప్రక్క రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా సక్సెస్ కాకపోవటం కూడా గమనించే చాలా జాగ్రత్తగా కెరీర్ ని ప్లాన్ చేస్తున్నట్లు తమిళ పత్రికలు రాస్తున్నాయి. ఇక శింబు చిత్రం కోసం మొదట ఆమెనే సంప్రదించారు. కానీ ఆ కథ శరత్ కుమార్ కి నచ్చక మొదటి సినిమాలో అటువంటి పాత్ర చేయదని చెప్పారని వినపడుతోంది. ఇక ఈ కొత్త చిత్రం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.


Click it and Unblock the Notifications











