»   » ప్రముఖ తమిళ దర్శకుడు సివి రాజేంద్రన్ కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు సివి రాజేంద్రన్ కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు సివి రాజేంద్రన్(81) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజేంద్రన్ మరణంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు, పలువురు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

చాలా కాలంగా వయసు సంబంధమైన అనారోగ్యంతో బాధ పడుతున్న సివి రాజేంద్రన్ ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఉదయం 8 గంటలకు మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ ఫిల్మ్ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ ద్వారా తెలియజేశారు. తమిళంలో లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ లాంటి టాప్ యాక్టర్లతో కలిసి పని చేసిన సివి రాజేంద్రన్ లేని లోటు పూడ్చలేనిది అన్నారు.

 Tamil director CV Rajendran passes away at 81

సివి రాజేంద్రన్ మరణంపై నిర్మాత ధనంజయన్ విచారం వ్యక్తం చేశారు. తమిళంలో ఎంతో మంది గొప్పనటులతో ఆయన పని చేశారని, రాజేంద్రన్ ఆత్మకు శాంతి కూరాలని ప్రార్థించారు. తమిళ సినీ క్రిటిక్ రమేష్ బాలా స్పందిస్తూ..... సివి రాజేంద్రన్ తన కెరీర్లో ఎన్నో గొప్ప సినిమాలు తీశారని తెలిపారు. రాజేంద్రన్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ నటించిన 'పావ మన్నిప్పు' చిత్రం త్వరలో రి-రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

English summary
Tamil director CV Rajendran passes away at 81, following some age-related ailments on Sunday morning. The news about his death has saddened his fans, who took to Twitter to pay their tributes to him. Ace Director CV Rajendran was reportedly suffering from a prolonged illness and he was recently admitted to Miot Hospital in Chennai. He breathed his last at the hospital at 8.00 AM on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X