తమిళ దర్శకుడి సూసైడ్ అటెంప్ట్.. నిద్రమాత్రలు మింగేసి, అనిరుద్‌ని నమ్ముకోవడం వల్లే!

సంచలన సంగీత దర్శకుడి అనిరుద్ రవిచంద్రన్ పరోక్షంగా ఓ దర్శకుడి ఆత్మహత్యాయత్నానికి కారణం అయ్యాడు. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ప్రయత్నించిన పొన్ముడి అనే దర్శకుడు సకాలంలో ఆసుపత్రికి చేరడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. ఇతడి సూసైడ్ కు కారణం చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకుడితో జరిగిన గొడవే అని తెలుస్తోంది. ఈ గొడవకు అనిరుద్ పరోక్షంగా కారణం అయ్యాడు.

విలన్ నుంచి దర్శకుడిగా

విలన్ నుంచి దర్శకుడిగా

పయ్యా, పచ్చాంకై లాంటి చిత్రాలలో విలన్ పాత్రల్లో నటించిన పొన్ముడి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలిసారి దర్శకుడిగా మారి సోమపాన రూప సుందరన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విష్ణు ప్రియన్ హీరోగా నటిస్తున్నాడు. బిగ్ బాస్ తో పాలుపర్ అయిన ఐశ్వర్య దత్త హిరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఐశ్వర్య దత్త నుంచే మొదట సమస్యలు మొదలయ్యాయి.

బిగ్ బాస్2

బిగ్ బాస్2

ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యాక ఐశ్వర్య దత్త బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్ గా అవకాశం పొందింది. దీనితో ఆమె బిగ్ బాస్ కు వెళ్ళిపోయింది. అప్పటి నుంచే ఈ చిత్ర చిత్రీకరణకు చిక్కులు మొదలయ్యాయి. క్రమంగా నిర్మాతలకు, దర్శకుడికి మధ్య కూడా మనస్పర్థలు తలెత్తాయి. తనకు ఏమాత్రం సహకరించక పోవడంతో దర్శకుడు పొన్ముడి మనస్థాపానికి గురయ్యాడు. ఇటీవల జరిగిన గొడవతో సూసైడ్ వరకు వ్యవహారం వెళ్ళింది.

అనిరుద్‌ని నమ్ముకుంటే

అనిరుద్‌ని నమ్ముకుంటే

ఈ చిత్రంలో ఒక సాంగ్‌ని సంగీత దర్శకుడు అనిరుద్ తో పాడించాలని ప్లాన్ చేశారు. ఆ సాంగ్ తో చిత్రానికి మరింత పబ్లిసిటీ తీసుకురావచ్చి పొన్ముడి భావించారు. కానీ చివరి నిమిషంలో అనిరుధ్ చేతులెత్తేయడంతో దర్శకుడు తీవ్రనిరాశకు గురయ్యాడట. తనకు సమయం లేదని పాడడం కుదరదని అనిరుద్ చెప్పాడట. ఈ అంశం గురించి పొన్ముడి, చిత్ర సంగీత దర్శకుడు అబ్బాస్ రఫీ, నిర్మాతల మధ్య వాగ్వాదం జరిగింది. మరింత నిరాశకు లోనైన పొన్ముడి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ప్రాణాపాయ స్థితి నుంచి

ప్రాణాపాయ స్థితి నుంచి

ఆయన సహాయదర్శకులు వేగంగా స్పందించి ఆసుపత్రికి చేర్చడంతో పొన్ముడికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పొన్ముడి ఈ ఘటనపై స్పందించాడు. ఈ చిత్రంలో అనిరుధ్ చేత పాట పాడిస్తానని అబ్బాస్ రఫీ నాకు మాట ఇచ్చాడు. అనిరుద్ కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. చివరి నిమిషంలో అనిరుద్ కుదరదని చెప్పడంతో షూటింగ్ కూడా నిలిచిపోయిందని, ఆ బాధతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానాని వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X